షార్ట్ సర్క్యూట్ తో జాతీయ పక్షి మృత్యువాత

షార్ట్ సర్క్యూట్ తో జాతీయ పక్షి మృత్యువాత

ముద్ర, ఎల్లారెడ్డిపేట :  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం స్థానిక సాయిబాబా దేవాలయ ఆవరణలో ఆదివారం జాతీయ పక్షి నెమలి షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందింది.  సాయిబాబా ఆలయ ప్రహరి గోడను ఆనుకొని ఉన్న ట్రాన్స్ పార్మర్ ఉండడంతో నెమలి గాలిలో ఎగురుతూ ప్రహరి గోడలోకి  ప్రవేశిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందినట్లు  తెలిసింది. ఆలయంలో జాతీయ పక్షి మృతి చెందడంతో భక్తులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఇప్పటివరకు  మృతి చెందిన విషయం అటవీ శాఖ  అధికారులకు అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బందికి  తెలియలేదు.