విద్యుత్ సమస్యను పరిష్కరించడానికే ట్రాన్స్ఫర్  ఏర్పాటు

విద్యుత్ సమస్యను పరిష్కరించడానికే ట్రాన్స్ఫర్  ఏర్పాటు
  • విద్యుత్ సమస్యలను తీర్చడానికి సెస్ సబైడివిజన్ కార్యాలయం

 ముద్ర,ఎల్లారెడ్డిపేట :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ లో వోల్టేజీ సమస్యను  పరిశీలించడానికి ఆ ఏరియాలో  వారంరోజులలో  ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనున్నట్లు  సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి తెలిపారు. అంబేద్కర్ నగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సెస్  డైరెక్టర్ వరుస కృష్ణహారి మాట్లాడుతూ   విద్యుత్తు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం  కోసం వినియోగదారులకు అందుబాటులో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో  సెస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కూడా త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకపోతున్నట్లు ఆయన ప్రకటించారు.కార్యాలయం  పనులు జరుగుతున్నట్లు అయన  చెప్పారు.

వినియోగదారులు ఏ సమస్యలు ఉన్నా సెస్ కార్యాలయంలో తనను సంప్రదించాలని ఆయన కోరారు.బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , స్థానిక ఎంపిటీసీ సభ్యురాలు  ఎలగందుల అనసూయ నర్సింలు  సూచనల మేరకు  కాలనీవాసుల ఆమోద యోగ్యమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని ట్రాన్స్ఫార్మర్ను  వారం రోజుల్లోగా పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు  కృష్ణారెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ బందారపు బాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలగందుల నరసింహులు, నంది కిషన్ , పందిర్ల పర్షరాములు గౌడ్, బాయికాడి రాజయ్య,  మద్దుల బాల్రెడ్డి , ఎలగందుల బాబు, ఎరుపుల హన్మయ్య, మ్యాకల  శరవింద్ ,  కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.