గీతా కార్మికులు ఆర్థికంగా బలపడాలి 

గీతా కార్మికులు ఆర్థికంగా బలపడాలి 
  • మరుగుజ్జు తాటి చెట్ల పెంపకానికి పెద్దపీట
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ముద్ర,ఎల్లారెడ్డిపేట:మరుగుజ్జు తాటి చెట్ల పెంపకానికి తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేసిందని గీతా కార్మికులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో హరితహారం లో భాగంగా తాటి చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామంలో శుక్రవారం స్థానిక ఎల్లమ్మ గుడి పరిసరాల ప్రాంతంలో మరుగుజ్జు తాటి చెట్లను మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు లతో కలిసి  నాటారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ నాణ్యమైన కళ్ళు ఔషధ గుణాలు కలిగిన శీతల పానీయాలు విక్రయించి కార్మికుల లబ్ధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం బీహార్ చత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి మరుగుజ్జు తాటి విత్తనాలను సేకరించడం జరిగిందని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గౌడ గీతా కార్మికులకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసి నాటించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 50వేల విత్తనాలు నాటుటకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. సాధారణంగా తాటి చెట్లు 20 ఏళ్ల లోపు కల్లు గీతకు వస్తే మరుగుజ్జు చెట్లు ఏడు సంవత్సరాలకే కళ్ళు పారే స్థాయికి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్, జిల్లా సీనియర్ ఉద్యమకారులు అందే సుభాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింలు, స్థానిక సర్పంచ్ శంకర్, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు,  గీతా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.