అద్దె గదుల  నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించాలి డీఎస్పీ నాగేంద్ర చారి

అద్దె గదుల  నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించాలి డీఎస్పీ నాగేంద్ర చారి
rented rooms should follow safety standards DSP Nagendra Chari

ముద్ర, వేములవాడ: రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని,అద్దె గదుల నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి అన్నారు.శనివారం పట్టణంలోని వ్యాపారులు, అద్దె గదుల నిర్వాహకులు, ఆటో కార్మికులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు.అదేవిధంగా అద్దె గదులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఫోటో గుర్తింపు కార్డు జిరాక్స్ పత్రం పెట్టుకొని అద్దె గదులు ఇవ్వాలని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.వ్యాపారులు అధిక ధరలతో భక్తులను మోసం చేయరాదని అన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు  భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు . వ్యాపారులు రహదాలను ఆక్రమించ కుండ వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు.మహాశివరాత్రి జాతరను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు . ఈ సమావేశంలో సిఐలు వెంకటేశ్, బన్సీలాల్, ఎస్ఐ లు రఫీ ఖాన్, వెంకట రాజం, ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్షులు బత్తుల దేవరాజం, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు,  వ్యాపారుల సంఘం అధ్యక్షులు పిన్నింటి హన్మండ్లు, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్,  ముంజ ఉమేందర్, లింగం యాదవ్, అంజత్ పాషా తదితరులు ఉన్నారు.