ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: బోయిన్ పల్లి వినోద్ కుమార్

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: బోయిన్ పల్లి వినోద్ కుమార్

బోయిన్ పల్లి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు

హైదరాబాద్ (ముద్ర న్యూస్):రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవరు , ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అనుబంధ ఆటో యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య, టిఆర్ఎస్కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్ ఎదురుకుంటున్న సమస్యలపై వినోద్ కుమార్ కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు , ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం తరఫున చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే నేడు కార్మిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్ రాణి కుమిదిని తో పోన్ ద్వారా చర్చించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఆటో కార్మికుల స్థితిగతులు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధ్యయనం చేయాలని సూచించారు.

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికుల తో రాజకీయాలకు అతీతంగా అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మీటర్ రేట్ల పెంపు, తగినన్ని పార్కింగ్ స్థలాలు కేటాయింపు, డ్రైవర్లకు సబ్సిడీ ద్వారా సులభంగా రుణాలు పొందే విధానం, ఇండ్లు లేని కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడంపై చర్చించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల కుటుంబాలు ఆధారపడ్డ ఆటో రంగాన్ని రక్షించడానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వినోద్ కుమార్ తెలిపారు.

ఇప్పటికే ఎక్కడలేని విధంగా ఐదు లక్షల ప్రమాద బీమా, లైఫ్ టాక్స్ రద్దు లాంటి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయి కార్యచరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నారాయణ, ఆటో యూనియన్ నాయకులు పాండు నాయక్, శంకర్ లాల్, గడ్డం శ్రీనివాస్, కొరిపాక అంజి శాతం రమేష్ నిరంజన్, దాసు రామకృష్ణ, సాయి, తదితరులు పాల్గొన్నారు.