గొంగిడి గో హెడ్ !

గొంగిడి గో హెడ్ !
  • విప్ సునీత, ఎన్ డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి దంపతులకు సీఎం కేసీఆర్ అభినందన
  • ప్రగతి భవన్ లో సీఎంను కలిసిన గొంగిడి దంపతులు
  • అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

ముద్ర ప్రతినిది ,భువనగిరి:  ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటా చేర్చుతున్నారు.  బీఆర్ఎస్ పార్టీని ఆలేరు కంచుకోటగా తీర్చిదిద్దినందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్లండి.. నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎన్ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులను అభినందించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను గొంగిడి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా యాదాద్రి లడ్డూ ప్రసాదం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తీరును సీఎం ప్రత్యేకంగా గుర్తు చేసి ప్రశంసించారు. పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణం నుండి అనుబంధ పాతగుట్ట ఆలయానికి రెండు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించాలని, ఆలేరు నియోజక వర్గములోని  బీటీ రోడ్ల కోసం, మైనారిటీల కోరిక మేరకు కొన్ని కబ్రస్తన్, పీర్ల కొట్టాల కోసం నిధులు మంజూరు చేయాలని విప్ సునీత సీఎం కేసీఆర్ కు  విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

మహేందర్ గుడ్ జాబ్
నష్టాలో  ఉన్న నల్లగొండ డీసీసీబీని అతి స్వల్ప కాలంలోనే లాభాల బాటలోకి తీసుకు వచ్చావు. గుడ్ జాబ్ మహేందర్ ( ఎన్ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ) అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించాలని ముఖ్యమంత్రి అన్నారు.