సీఎం ఏక్ నాథ్​ షిండే పిలుపుతో...

సీఎం ఏక్ నాథ్​ షిండే పిలుపుతో...

హుటాహుటిన ముంబై వెళ్లిన శివసేన రాష్ట్ర అద్యక్షుడు సింకారు శివాజీ
సీఎం కేసీఆర్​ మహారాష్ట్ర పర్యటనపై చర్చలు
కేసీఆర్​ హామిలపైన ఉద్యమించాలని నిర్ణయం
జిల్లాల్లో కమిటీలు వేయాలని చర్చ
119 స్థానాల్లో శివసేన పోటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో:  ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కార్యాలయం నుంచి శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుని పిలిచారు. హుటా హుటిన ముంబై వెళ్ళిన  రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ, శివసేన కేంద్ర కార్యాలయం బాల సాహెబ్ భవన్‌ లో రెండు రోజుల పాటు ముంబైలో కీలక నేతలతో సమావేశం జరిగింది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే చెప్పిన మాటలను ప్రజలకు చెప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటన పైన చర్చ జరిగినట్లు సమాచారం. కేసిఆర్ హామీల పైన కూడా ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జాతీయ నాయకత్వం. గురువారం, శుక్రవారం బాల సాహెబ్ భవన్‌ లో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల పైన, పార్టీ బలోపేతం  మరియు కీలకమైన అంశాలపైన  శివ సేన పార్టీ కేంద్ర కార్యాలయం బాల సాహెబ్ భవన్‌ లో పలు అంశాలపైన పార్టీ జాతీయ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్‌, పార్టీ జాతీయ కార్యదర్శి బాలివుడ్ నటుడు మరియు శివ సేన పార్టీ చిత్ర పరిశ్రమ అధ్యక్షులు సుషాంత్‌ షేలర్, శివసేన ఎంపీ భావన గావ్లీ చర్చించిన విషయం శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజి తెలిపారు. 


 తెలంగాణ రాష్ట్రంలో శివసేన జెండా ఎగరాలనీ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం  ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు వెల్లమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదేశాలు జారి చేసినట్టు ఆయన తెలిపారు. ప్రతీ జిల్లాలో పర్యటించి కమిటీలు వేసి, కార్యకర్తల సంఖ్య పెంచేందుకు  కృషి చేయాలని సూచించిన విషయం తెలిపారు. త్వరలో శివసేన పార్టీ ఆధ్వర్యంలో విడతల వారిగా  భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చర్చించడం జరిగిందని సింకారు శివాజీ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయమని చర్చలో ఉన్న వారు అన్నట్టు వెల్లడించారు. ఈ నెల 22 తేదీన సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో  ప్రెస్ మీట్ నిర్వహించి వివిధ అంశాలపైన స్పందించిన తీరు పైన రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీసిన విషయం చర్చలో జాతీయ నాయకులకు వివరించామని అన్నారు.

వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు , తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సింకారు  తెలిపారు. త్వరలో శివ సేన పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ  అన్నారు. 119 శాసన సభ స్థానాలలో శివసేన పార్టీ నుంచీ అభ్యర్ధులు ఉంటారని మరొక సారి స్పష్టం చేసారు. శివ సేన ఇచ్చిన మాట తప్పకుండా ప్రకటించిన విధంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతం కోసం శివసైనికులు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషి పట్ల శాబాష్ అంటు  సింకారు శివాజీకి శివసేన జాతీయ నేతల అభినందనలు.