గాంధీ కుటుంబం పై మోడీ కక్ష జగ్గారెడ్డి

గాంధీ కుటుంబం పై మోడీ కక్ష జగ్గారెడ్డి

ముద్ర తెలంగాణ బ్యూరో: గాంధీ కుటుంబం మీద మోడీ ఎంత కక్ష పెంచుకున్నాడు అనే దానికి ఈ అనర్హత వేటు నిదర్శనమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లో గాంధీ అనే పేరు వినిపించకూడదనే ఆలోచన లో మోడీ, బీజేపీ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంత చిల్లర వ్యవహారం ఏ పార్టీ కూడా చేయలేదనారు. రాహుల్ గాంధీ మాటలు బీజేపీ తట్టుకోలేక పోతుందని మండిపడ్డారు. *రాహుల్ గాంధీ పై రాజకీయ కుట్ర చేస్తుందన్నారు.రాహుల్ గాంధీకి..ఎంపీ పదవి అవసరం లేదు. పార్లమెంట్ లో ఉన్నా.. బయట ఉన్నా..గాంధీ కుటుంబం కి విలువ ఉందని తెలిపారు. *రాజకీయ విలువలున్న అద్వానీ ని ప్రధాని కాకుండా అడ్డుకున్నారు మోడీ అని ఆరోపించారు.మన్మోహన్ సింగ్ ..రాహుల్ గాంధీని ప్రధాని కావాలని చెప్పినా లైట్ తీసుకున్నారని చెప్పారు. *మోడీ పదే పదే  అద్వానీ కాళ్ళు  మొక్కారని ద్వజమెత్తారు. మొక్కిన కాళ్ళని లాక్కున్నాడు మోడీ. బ్యాంకులను మోసం చేసిన వాళ్లు మోడీ లే కదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు అనుమానం రావడం సహజమని తెలిపారు.

బీజేపీ ది క్రిమినల్ ప్రభుత్వం
క్రిమినల్ మైండ్ తో నడుస్తున్న ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. ఆధాని కంపనీ లో... అమిత్ షా కొడుకు..వాటా ఉందని ఆరోపించారు. అమిత్ షా... మోడీ మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం నడుస్తోంది. ఆధాని స్కాంతో బీజేపీలో కొట్లాటలు జరుగుతున్నాయిని తెలిపారు. వీటన్నింటి నుండి బయట పడేందుకు అనర్హత వేటు వేశారు. స్వాతంత్రం రాక ముందు మోడీ పుట్టలేదు. రాహుల్ కుటుంబం సంపద అంతా దేశానికి అంకితం చేశారన్నారు.ఈ చరిత్ర దేశంలో ఎవరికీ లేదు.రాహుల్ గాంధీ పాదయాత్ర చూసి బీజేపీ మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు. రాహుల్ కు మేమంతా అండగా నిలబడతామని జగ్గారెడ్డి అన్నారు