మధ్యాహ్నం ఢిల్లీ  బీఆర్​ఎస్​ కేంద్ర కార్యాలయం ప్రారంభం

మధ్యాహ్నం ఢిల్లీ  బీఆర్​ఎస్​ కేంద్ర కార్యాలయం ప్రారంభం

ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్. మధ్యాహ్నం బీఆర్​ఎస్​ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్​ఆఫీసులో వాస్తు పూజ, నవ చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్​ దంపతులు పాల్గొంటారు. 1.05 నిమిషాలకు బీఆర్​ఎస్​ ఆఫీసును ప్రారంభిస్తారు. నిరాడంబరంగానే ప్రారంభోత్సవం జరుగుతుంది. తక్కువ మందే హాజరవుతారు. బీఆర్​ఎస్​ ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు పాల్గొంటారు. ఇప్పటికే డిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​గౌడ్​, సబిత, సత్యవతి రాథోడ్​, ఎంపీలు. 2024 సార్వత్రిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి బీఆర్​ఎస్​ కార్యకలాపాలు సాగుతాయి. ఢిల్లీలో బీఆర్​ఎస్​ కార్యాలయ భవన నిర్మాణం 20 నెలల్లో పూర్తయింది. 1300 గజాల స్థలంలో 20 వేల చదరపు అడుగుల్లో భవనం నిర్మించారు. జీప్లస్​ త్రీ విధానంలో భవనం నిర్మించారు. మొత్తం 5 అంతస్తులు ఉంది. లోయర్​గ్రౌండులో మీడియా సమావేశాలు జరుగుతాయి. గ్రౌండ్​ ఫ్లోర్​లో పార్టీ ప్రధాన కార్యదర్శల కోసం 4 గదులు కేటాయించారు. ఆ ఫ్లోర్​లోనే రిసెప్షన్​, క్యాంటీన్​ ఉన్నాయి. మొదటి ఫ్లోర్​లో పార్టీ అద్యక్షుడి చాంబర్​, పేషీ, కాన్ఫరెన్స్​ హాలు ఉన్నాయి. ఢిల్లీ పార్టీ కార్యక్రమాల కోసం 2,3 అంతస్తులు కేటాయించారు. ఢిల్లీ పార్టీ నేతలు, కార్యకర్తలు బస చేయడానికి 18 గదులతోపాటు 2 ప్రత్యేక సూట్​ రూములు ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని బీఆర్​ఎస్​ జాతీయ కార్యాలయం దగ్గర మీడియాపై ఆంక్షలు  విధించారు.    బీఆర్​ఎస్​ కార్యాలయంలోకి అనుమతి ఇవ్వని నేతలు. మీడియా ప్రతినిధులను బయటకు పంపేసిన నేతలు, సీఎం సిబ్బంది. కార్యాలయం గేటు బయట కూడా ఉండనివ్వలేదు.