సర్దార్ సర్వాయిపాపన్న ఆశయ సాధనకు కృషి చేద్దాం: టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి

సర్దార్ సర్వాయిపాపన్న ఆశయ సాధనకు కృషి చేద్దాం: టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి

ముద్ర , కుషాయిగూడ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కు కృషి చేయాలని టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతి సందర్భంగా ఈసిఐఎల్ చౌరస్తాలో గౌడ జేఎసి రాష్ట్ర కో కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సోమశేఖర్ రెడ్డి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి  వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. కేవలం ఎన్నికల వేల అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలుపడం ఏంటని ప్రశ్నించారు.

తొమ్మిది ఏళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వానికి పాపన్న చరిత్ర గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలు చేస్తూ, విబజించు, పాలించు వ్యవహార శైలి తో కొనసాగుతుందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళ ఆనంద్ గౌడ్, యువజన నాయకులు బుడంపల్లి నిరంత్ గౌడ్, కాసుల సురేందర్ గౌడ్, దూడల సాంబమూర్తి గౌడ్, వంశరాజ్ మల్లేష్, మచ్చ పాండు గౌడ్, పెరుమండ్ల దేవేందర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, బుడంపల్లి వెంకటేష్ గౌడ్, పట్టపర్ల ప్రశాంత్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.