రేణుకా మాత సేవలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

రేణుకా మాత సేవలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట రేణుకా దేవి ఐదవ వార్షికోత్సవంలో ఆదివారం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి అఖండ దీపారాధన, గణపతి పూజ, అభిషేకము, అమ్మవారి కుంకుమార్చన తదితర పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు స్థానిక నాయకులు దుర్గారావు, గౌడ సంఘం ప్రముఖులు, గ్రామ ప్రముఖులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరితా సాయగౌడ్, స్థానిక ఎంపీటీసీ స్వప్న దుర్గారావు, మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రావు, పాపన్నపేట్ మండల సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, సర్పంచులు దేవగౌడ్, యామిరెడ్డి, శ్రీను నాయక్, లక్ష్మీ నారాయణ, వినోద్ కుమార్, నాగరాజు, నార్ల సాయిలు, కిషన్ నాయక్, ఎంపీటీసీల చిట్యాలశ్రీనివాస్, సిద్దిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భిక్షపతి రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్, నాయకులు గుడాల పోశెట్టి, భిక్షపతి, వెంకట్, శేఖర్, మోహన్, మహేందర్, యాదగిరి, శంకర్, కిష్టయ్య, యువనాయకులు సాప ప్రశాంత్, రాజు, వినయ్ కుమార్, రాజీపేట్ గ్రామ గౌడ సంఘం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.