జక్కన్నపేటలో వైభవంగా నృసింహ జయంతి

జక్కన్నపేటలో వైభవంగా నృసింహ జయంతి

కల్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శశి, నాక్ స్టేట్ బాస్ బిక్షపాతి
ముద్ర ప్రతినిధి, మెదక్: నృసింహ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట కొండపై స్వామివారికి ఉదయం నుండి అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పల్లకి సేవ జరిపారు. ఆలయ ధర్మకర్తలు విట్టలరావు, హన్మంత్ రావుల ఆధ్వర్యంలో నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి సునీత దంపతులు,
నాక్ రాష్ట్ర అధికారి బిక్షపతి, నాయకులు సత్యవర్ధన్ రావు., వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

తీర్థ ప్రసాదం అనంతరం అన్నదానం చేశారు. సాయంత్రం స్వామివారికి శకట బ్రమణోత్సవం నిర్వహించారు. వతన్ బండ్లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వరు బండ్లు తిప్పారు. రంగు రంగులతో ఎడ్ల బండ్లను అలంకరించారు. ట్రాక్టర్లు సైతం పెద్ద ఎత్తున తిప్పారు. కాగా మెదక్ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కాకులవరం మధుసూదన చారి ఆధ్వర్యంలో వేడుకలు జరగ్గా మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.