రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ మృతి

రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ మృతి

పెద్ద శంకరంపేట, ముద్ర: పెద్దశంకరంపేట మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ఆశల్లగారి కవిత(35) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం శనివారం ఉదయం తన భర్త జవహర్ తో కలిసి హోండా షైన్  బైక్ పై ఎల్లారెడ్డి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెకప్ నిమిత్తం వెళ్తుండగా నిజాంసాగర్  సమీపంలోని బొగ్గు గుడిసె వద్ద బైక్ పై నుంచి జారీ పడగా తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే  ఎల్లారెడ్డిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం దక్కలేదు. చికిత్స అందించే లోపు మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులున్నారు.  అందరితో కలిసి మెలిసి ఉండే కవిత మృతితో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకన్నాయి.