ట్రాక్టర్ బోల్తా-డ్రైవర్ మృతి, మరొకరికి గాయాలు

ట్రాక్టర్ బోల్తా-డ్రైవర్ మృతి, మరొకరికి గాయాలు

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన హవేలి  ఘనపూర్ మండలం బి.తిమ్మాయిపల్లి గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన లింగం, ప్రశాంత్ ఇసుక కోసం ట్రాక్టర్ తీసుకొని వెళుతుండగా ప్రమాదవశాత్తు ఇంజిన్ తలకిందులు కాగా లింగం అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రశాంత్ కు తీవ్రకాయలు కాగా 108 అంబులెన్స్ లో మెదక్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందతున్నాడు.