సిరిసిల్ల జడ్పీ చైర్మన్ అరుణరాఘవరెడ్డి తో చెల్మెడ వర్గం భేటీ

సిరిసిల్ల జడ్పీ చైర్మన్ అరుణరాఘవరెడ్డి తో చెల్మెడ వర్గం భేటీ
  • చల్మెడ కు మద్దతు కోసం గంటన్నర సింగిల్ విండో చైర్మన్ ల చర్చలు..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. వేములవాడ టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకునేందుకు... ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తనకు మద్దతు పలికి వందలాదిమంది టీఆర్ఎస్ శ్రేణులు బయటికి వస్తుండగా... వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు తో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న వారితో చర్చలు జరుపుతున్నారు. తటస్థంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో చల్మెడ వర్గం ఇంటికెళ్లి మరి వారితో చర్చలు జరిపి చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు మద్దతు పలకాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కోనరావుపేట మండలం చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, సనుగుల పిఎసిఎస్ చైర్మన్ కిషన్ రావు, కోనరావుపేట పిఎసిఎస్ చైర్మన్ బండ నరసయ్య కొలనూరు పిఎసిఎస్ చైర్మన్ రామ్మోహన్ రావు, చందుర్తి మండల వైస్ ఎంపీపీ అబ్రహం ,లింగంపేట ఎంపిటిసి రమేష్ రావు లు సిరిసిల్ల చైర్పర్సన్ సమావేశమయ్యారు. గంట నరపడు చర్చలు జరిపినట్లు సమాచారం. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకు వ్యతిరేకంగా ఉన్న వారందరి ఒక వేడుకపై తీసుకువచ్చేందుకు చల్మెడ వర్గం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చైర్మన్ తో ఈ సమావేశం వేములవాడ రాజకీయాల్లో మరోసారి హార్ట్ టాపిక్ అయ్యింది. వేములవాడ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం ఎవరికీ ఇచ్చిన పని చేస్తామని చెబుతూనే చల్మెడ వర్గం వేములవాడ ఎమ్మెల్యే జన్నమనేని రమేష్ బాబుకు వ్యతిరేకంగా రాజకీయ పావులు కదపడం రాజకీయ చర్చకు దారి తీస్తుంది.