అన్నదాతలను ఆదుకోవాలి - కాంగ్రెస్ పార్టీ డిమాండ్

అన్నదాతలను ఆదుకోవాలి - కాంగ్రెస్ పార్టీ డిమాండ్

ముద్ర, ఎల్లారెడ్డిపేట: అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని  ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో గత వారం రోజుల నుండి కురిసిన వర్షాలకు వరి పొలాలు పూర్తిగా దెబ్బతినడం జరిగిందని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సుమారు 100 ఎకరాలలో వరి నాట్లు వేసిన పొలాలలో వర్షాలకు ఇసుక మేట  వేయడం జరిగిందన్నారు. కొంతమంది ఇండ్లు వర్షాలకు నేలపట్టం కాగా వారికి తాత్కాలిక సహాయం కింద 20వేల నగదు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తిమ్మాసికుంటకు గండి పడిందని దానిని పూడ్చివేయాలన్నారు. మండల కేంద్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బ తినడం జరిగిందని వాటికి మరమ్మత్తులను చేపట్టాలన్నారు. ప్రభుత్వం గతంలో కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదన్నారు.కనీసం ఇప్పుడైనా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం  గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, నాయకులు చెన్ని బాబు, గంటబుచ్చా గౌడ్,వంగ గిరిధర్ రెడ్డి, మల్లారెడ్డి ,సతీష్, గుండాడి రాంరెడ్డి, రఫీక్, లక్ష్మీనరసయ్య,  ఉప్పుల రవి తదితరులు పాల్గొన్నారు.