ఏకగ్రీవ తీర్మానం ఏ విధంగా చేస్తారు....

ఏకగ్రీవ తీర్మానం ఏ విధంగా చేస్తారు....
  • జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిపై సంఘ సభ్యుల ఫైర్..

ముద్ర, గంభీరావుపేట :ప్రజా ఆశీర్వాద సభలో వచ్చే ఎన్నికల్లో  మంత్రి కేటీఆర్ కే మద్దతు తెలుపుతు రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి ఏకగ్రీవ తీర్మానాన్ని ఇవ్వడం పై గంభీరావుపేట మండల రెడ్డి సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, రెడ్డి సంఘ సభ్యులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బీఆర్ ఎస్ కీ మద్దతు తెలుపుతూ తీర్మానం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఏకగ్రీవ తీర్మానానికి,రెడ్డి సంఘానికి ఎటువంటి సంబంధం లేదని,ఈ తీర్మానం చెల్లదని అన్నారు.  రెడ్డి సంఘ సభ్యులు మనోభావాలను దెబ్బతీసేలా  జిల్లా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడని అన్నారు.  రెడ్డిల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టిన జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు తెలిపిన గంభీరావుపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంఘ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో ఆందోళనలు  ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటయ్యగారి రాజేందర్ రెడ్డి,దమ్మ శ్రీనివాస్ రెడ్డి ,వంగ దామోదర్ రెడ్డి,చల్ల కృష్ణారెడ్డి,గడ్డమీద ప్రసాద్ రెడ్డి,లక్కిరెడ్డి రాజిరెడ్డి,మద్దుల రాజిరెడ్డి, చల్ల సంజీవరెడ్డి,గణేష్ రెడ్డి,కూరెల్లిరామచంద్రరెడ్డి,  బిచ్చల  రాజిరెడ్డి, లక్కిరెడ్డి సుభాష్ రెడ్డి, ముత్యాల సంజీవరెడ్డి, సత్యం రెడ్డి, లక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, రాజిరెడ్డి,లింబయ్యగారి సంజీవరెడ్డి,లింగారెడ్డి,మద్దుల లక్ష్మీనారాయణ, సుల్తాన్ ఎల్లారెడ్డి, మరియు పలు గ్రామాల  రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు