వేములవాడలో వేడిక్కిన రాజకీయం..

  • జర్మనీకి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు..
  • నియోజకవర్గంలో వేగం పెంచిన చల్మెడ, ఏనుగు
  • వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసేందుకు వచ్చిన చెన్నమనేని వర్గీయులకు షాక్
  • పిలిచిన పలకకుండా చూసి వెళ్లిపోయిన మంత్రి కేటీఆర్
  • శనివారం వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన చల్మెడ 
  • చెన్నమనేనికే టికెట్ కేటాయించాలని కేటీఆర్ను కలిసేందుకు వచ్చిన చెన్నమనేని వర్గీయులు..?
  • చెన్నమనేని వర్గానికి కేటీఆర్ సమయం ఇవ్వకపోవడంతో రాజకీయ చర్చ
  • స్పీడ్ పెంచిన చల్మెడ..
  • రేపు వేములవాడ లో విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రడి చేసి ఈ నెల 21న ప్రకటించనున్న క్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు అనుచరవర్గం.. సూమారు 30 మంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిరిసిల్ల లో కలిసేందుకు వచ్చి భంగపాటుకు గురికావడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. వేములవాడ ఎమ్మెల్యే టికెట్ చెన్నమనేని రమేశ్బాబుకే ఇవ్వాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేసేందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వేములవాడ ప్రజాప్రతినిధులు సిరిసిల్ల పర్యటనతో చెన్నమనేని బీఆర్ఎస్ టికెట్ రాదు అని డీసైడ్ ఐనట్లు చర్చ జరుగుతుంది. సిరిసిల్ల సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి భర్త.. రామతీర్ధపు రాజు, జడ్పీటీసీలు, పలువురు ముఖ్య నాయకులు సిరిసిల్ల లో కేటీఆర్ను కలిసేందుకు వచ్చిన వారిలో ఉన్నారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వెలమ సంఘం చాంబర్ లో సమావేశమైన అనంతరం కేటీఆర్ వద్దకు వెళ్లారు.

వేములవాడ బీఆర్ఎస్ నేతలను కేటీఆర్ చూసిన పట్టించుకోలేదు. వేములవాడ నాయకులు కేటీఆర్ను కారు ఆపాలను డోర్ వద్దకు వెళ్లి ప్రాదేయపడిన.. చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లిపోయాడు.దీంతో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు కు మంత్రి కేటీఆర్కు మధ్య మంచి వాతవారణం లేదని తేలిపోయింది. వేములవాడ ఎమ్మెల్యే టికెట్ చల్మెడ ఆనందరావు వైద్య సంస్థల అధినేత.. చల్మెడ లక్ష్మీనరసింహరావుకు కేటాయించారా అనే రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఉన్నట్లుండి చెన్నమనేని వర్గం కేటీఆర్ కలవకపోవడంతో ఒక్కసారిగా డీలా పడినట్లు అయ్యింది. కీలక సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు తన కూతురు పట్టా ప్రధానోత్సవానికి జర్మని వెళ్లడం.. వేములవాడ రాజకీయాలు రోజు రోజుకు మారిపోవడంతో చెన్నమనేని వర్గంలో నిరాశ, నిశ్రృహాలు నెలకొన్నాయి. ఇదే అదునుగా చల్మెడ వర్గం స్పీడ్ పెంచుతుంది. చల్మెడ లక్ష్మీనరసింహరావు వేములవడ ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తూ.. రోజు ఏదో ఒక మండలంలో వైద్య శిబిరాలు పేరిట.. ఉచిత వైద్య సేవలు అందిస్తూనే.. తన పని తాను చేసకుపోతున్నాడు. ఉన్నట్లుండి శనివారం వేములవాడ లో నియోజకవర్గం స్తాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్న బోజనాల ఏర్పాటు చేసి మరి.. రెండు సెషన్లు బీఆర్ఎస్ సమావేశాన్ని నిర్వహించేందుకు చల్మెడ ప్రణాళిక సిద్దం చేసి చల్మెడ అభిమానుల వాట్సప్ గ్రూపులో మేసేజ్ పెట్టించాడు. ఎమ్మెల్యే చెన్నమనేని వర్గీయులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే మేసేజ్లు.. పోస్టులు పెట్టిన ఎవరు పట్టించుకోవద్దని.. సంయయనం పాటించి.. ఓపికతో ఉండాలని పిలుపునిచ్చారు.

వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు కోసం మాత్రమే పని చేయాలని చల్మెడ లక్ష్మీనరసింహరావు పిలుపునివ్వడం తీవ్ర దుమారం లేపుతుంది. దీనికి తోడు ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏనుగు మనోహర్ రెడ్డి కూడా శనివారం గీప్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. తన పర్యటనలు తాను చేస్తున్నాడు. వేములవాడ జరుగుతున్ రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుంది.. తాము ఎవరితో ఉండాలి.. వేములవాడ టికెట్ ఎవరికో ఒకరికి వెలమ సామాజక వర్గం నేతకే వచ్చినప్పటికి.. వీరిద్దరి రాజకీయ లొల్లి మా సావుకొచ్చింది అంటూ బీఆర్ఎస్ లో చర్చ కొనసాగుతుంది. ఈ నెల 21న వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి పేరును సిఎం కేసీఆర్ ప్రకటిస్తారని చర్చ కొనసాగుతుండగా.. మొదటి లిస్టులో వేములవాడ పెండింగ్ పెడతారిని పలువురు చర్చిస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే టికెట్ చెన్నమనేనికా.. చల్మెడకా.. అనే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఎదురుచూస్తుంది. ఏది ఏమైన కేటీఆర్ ను చెన్నమనేని వర్గం కలవడానికి వచ్చి భంగపాటుకు గురికావడం రాజన్నసిరిసిల్ల జిల్లా లో చర్చనీయంశం అయ్యింది.