బీఆర్ఎస్ ను వీడుతున్న సెస్ మాజీ వైస్ చైర్మన్ లగిశెట్టి

బీఆర్ఎస్ ను వీడుతున్న సెస్ మాజీ వైస్ చైర్మన్ లగిశెట్టి
Ses former Vice Chairman Lagishetti leaving BRS Party
  • డేట్ ఫిక్స్ చేసుకున్న బీఆర్ఎస్ నేత లగిశెట్టి
  • జనవరి 28న బీజేపి లో చేరికకు మూహుర్తం..?

ముద్ర, రాజన్నసిరిసిల్ల బ్యూరో: బీఆర్ఎస్ నాయకుడు, సిరిసిల్ల సెస్ మాజీ వైస్ చైర్మన్, పద్మశాలీ సంఘం రాష్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ బీఆర్ఎస్ ను వీడటం దాదాపు ఖాయమైంది. రెండెళ్లుగా బీఆర్ఎస్ లో న్యూట్రల్ గా ఉన్న లగిశెట్టి శ్రీనివాస్ ను బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 20 రోజుల క్రితం లగిశెట్టి ఇంటికి  తేనిటి విందుకు హజరయ్యారు. బీజేపి లోకి రావాలని బండి సంజయ్ ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో లగిశెట్టి శ్రీనివాస్ జనవరి 28న బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపి పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్దం  చేసుకున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం ఐతే ఓ రెండు మూడు రోజులు ఆలస్యం కావచ్చని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. 

లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల ప్రాంతంలో పలు సామాజి సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస చారిటేబుల్ ట్రస్టు ద్వారా వృధ్ధాశ్రయం నిర్వహిస్తూ.. ఇప్పటి వరకు సిరిసిల్ల నియోకవర్గంలో 500 మందికి పైగా పేద కుటుంబాలకు పుస్తె మట్టెలు పంపిణ చేశారు. పలువురికి ఆర్థిక సహయాలు చేస్తూ వస్తున్నారు. 2009 లో లగిశెట్టి శ్రీనివాస్ ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా బరిలో ఉంచాలని పద్మశాలీ సంఘం తీర్మాణం చేసిన. ప్రస్తుత మంత్రి కేటీఆర్ పైన వద్దని సన్నిహితులు పేర్కొనడంతో వెనక్కి తగ్గారు. కేటీఆర్ ఆశీర్వాదంతో సెస్ వైస్ చైర్మన్ పదవి చేపట్టిన.. తర్వాత నెలకొన్ని రాజకీయ పరిణామాలు లగిశెట్టిని పార్టీ వీడేలా చేస్తున్నాయి. ఏది ఏమైన ఈ నెల 28న లగిశెట్టి శ్రీనివాస్ బీజేపి పార్టీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమైంది.