చల్మెడ ఓ వైపు.. ఏనుగు మరో వైపు.. 

చల్మెడ ఓ వైపు.. ఏనుగు మరో వైపు.. 
  • వేములవాడ నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు..
  • పరామర్శలు.. ఆర్థిక సాయాలు.. సామాజిక సేవల్లో వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తున్న నేతలు
  • మాజీ ఎంపిపి వెంకటేశ్గౌడ్ విమర్శించిన తెల్లవారే మరో కార్యక్రమం నిర్వహించిన ఏనుగు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:-రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుపై ఆయన వ్యతిరేఖ వర్గం మాజీ ఎంపిపిలు రంగు వెంకటేశ్ గౌడ్, చిలుక పెంటన్నలు ప్రెస్ మీట్ పెట్టి మరి తాము వినోద్ కుమార్ బర్త్ డే వేడుకలు నిర్వహించినందుకు పార్ట సస్సెండ్ చేశారు.. చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి కూడా రమేశ్ బాబు అనుమతి లేకుండా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నరన్నారు.

మంత్రి కేటీఆర్ కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన తెల్లవారే బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం తక్కళ్ళ పల్లె గ్రామంలోని కళ్యాణ మండపంలో "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా "ఉపాధి హామీ కూలీలకు హాట్ బాక్సులు" పంపిణి చేశారు. పర్యటనల సంఖ్య పెంచి గ్రామాల్లో కార్యక్రమాలకు జన సమీకరణ చేస్తున్నారు. దీంతో వేములవాడలో పోలిటికల్ హీట్పెరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం చల్మెడ లక్ష్మీనరసింహరావు, మరో వైపు ఏనుగు మనోహర్ రెడ్డిలో పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర టికెట్ కోసం లాభియింగ్ చేస్తున్నట్లు తెలసింది.  బుదవారం హాట్ బాక్సులు పంపణి కార్యక్రమంలో సర్పంచులు, కొలకాని శేఖర్,నరేందర్ రెడ్డి,ఎంజీ రెడ్డి, ఎంపీటీసీలు జిల్లా రాజు, గంగా రెడ్డి, రమేష్ గౌడ్,పాక్స్ చైర్మెన్ చుక్క దేవరాజం, మాజీ ఎంపీటీసీ ఏనుగు ఆది రెడ్డి,ఉప సర్పంచ్ జవ్వాజి శ్రీనివాస్, డైరెక్టర్ తోట చౌదరి, శ్రీనివాస్ ,మండల మైనారిటీ సెల్ & గ్రామ శాఖ అధ్యక్షులు ఎండీ ఇర్ఫాన్,పొన్నం నరేందర్,రమేష్ గౌడ్, కోట, లక్ష్మీ నర్సయ్య,ముంజ రమేష్, మహిపాల్, అశోక్, రాజిరెడ్డి, మోహన్,సత్తార్,ముత్త మహేష్, మారం మహేష్, జలంధర్,శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రెడ్డి,రాజు,అరుణ్,పొన్నం శ్రీధర్, శ్యాం, గడ్డం రాధ తదితరులు పాల్గొన్నారు.