చెన్నమనేని వ్యతిరేఖ వర్గం ఒక్క తాటిపైకి..

  • బీసీలకు ఒక్క న్యాయం.. ఓసీలకు ఒక్క న్యాయమా..?
  • ఆనాడు బోయినపల్లి వినోద్ బర్త్డే వేడుకలు చేస్తే సస్పెండ్ చేశావ్
  • నేడు అవే వేడుకలు నిర్వహించిన చల్మెడ, ఏనుగును సస్పెండ్ చేసే దమ్ముందా..?
  • వారిని సస్పెండ్ చేయండి లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి
  • వేములవాడ మాజీ ఎంపిపి రంగు వెంకటేశ్గౌడ్ సంచలన వాఖ్యలు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు సొంత నియోజకవర్గంలో సోంత పార్టీ నేతలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురౌతుండగా. మరో వైపు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టులో వేసిన పౌరసత్వం కేసు పెండింగ్, జడ్జీమెంట్ టెన్షన్  ఆయన అభిమానుల్లో మొదలైంది. ఇదిలా ఉండగా చెన్నమనేని రమేశ్బాబు వ్యతిరేఖ వర్గం అంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఎమ్మెల్యే రమేశ్ బాబును వ్యతిరేఖిస్తున్న వేములవాడ మాజీ ఎంపిపి రంగు వేంకటేశ్గౌడ్, చందుర్తి మాజీ ఎంపిపి చిలుక పెంటన్నలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోని అనంతరం  ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే రమేశ్ బాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తే నియోకవర్గంలో తానే ఒక్కడినే బాస్నని, తనకు తెలియకుండ వేములవాడ నియోజకవర్గం మేడిపల్లిలో వినోద్ కుమార్ బర్త్ డే వేడుకలు నిర్వహించినందుకు మలిదశ ఉద్యమకారులైన తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు.

కానీ ఇప్పుడు వేములవాడ నడిబొడ్డున సంగీత నిలయానికి దగ్గరలోనే బీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు కార్యాలయం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తే ఎందుకు పట్టించుకోలేదన్నారు. తనకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్న మరో బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి కూడా మేడిపల్లి మండలంలో కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించి విరాళాలు ఇస్తే ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను టార్గెట్ చేసి పార్టీ నుంచి సస్సెండ్ చేసినట్లు అగ్రవర్ణాల నాయకులను ఎందుకు సస్సెండ్ చేయడం లేదని రంగు వేంకటేశ్ గౌడ్ ఎమ్మెల్యే రమేశ్ బాబును ప్రశ్నించారు. దమ్మంటే బీఆర్ఎస్ పార్టీ నంచి చల్మెడ లక్ష్మీనరసింహరావును, ఏనుగు మనోహర్ రెడ్డిని బహిష్కరించాలని లేకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సంచలన వాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వేములవాడ ఎమ్మెల్యే కు ఓడించదాక తాము నిద్రపోమంటూ శపధం చేశారు. ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో వేములవాడ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, చందుర్తి మాజీ ఎంపీపీ చిలక పెంటన్న, మేడిపల్లి మాజీ సర్పంచ్ బొమ్మని రాజ గౌడ్, కథలాపూర్ మండల్ నాయకులు, మహ్మద్ ఇక్బాల్, గంగాధర్ రాజిరెడ్డి, బాలసాని మారుతి, రాజు రెడ్డి, దోస గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.