ప్రజలను జాగృత పరిచేందుకు ప్రజా గోస-బీజేపీ భరోసా...

ప్రజలను జాగృత పరిచేందుకు ప్రజా గోస-బీజేపీ భరోసా...
BJP leader Rani Rudrama

ముద్ర, గంభీరావుపేట: ప్రజలను జాగృతి పరచందుకే, ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర  ను బీ జే పీ  చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు.. ప్రజాగోస, బీజేపీ  భరోసా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు రాణి రుద్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ  ప్రజాస్వామ్యంలో  ప్రజలకు వద్దకు వెళ్లి, ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు ఉన్నదని బీజేపీ  మీటింగులు పెడితే టిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం  విడ్డూరంగా ఉన్నదని , బరాబరి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ మీటింగ్లు పెడతామని , బీజేపీ  ఎక్కడ ఉన్నది అని, అన్నోళ్లకు గల్లి గల్లి కి 11వేల కార్నర్ మీటింగ్లు  పెట్టి బీజేపీ ఉన్నదని చూపిస్తున్నామని అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చినప్పుడల్లా  బీజేపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి కేటీఆర్ కు బిజెపి అన్న, బిజెపి కార్యకర్తలు, నాయకులు అన్న భయం పుచ్చుకున్నదని అన్నారు. మంత్రి కేటీఆర్ కు వారి పరిపాలన పట్ల నిజాయితీ ఉంటే, మళ్లీ సిరిసిల్ల పర్యటనకు వచ్చినప్పుడు ఒక్క బీజేపీ కార్యకర్తను అరెస్టు చేయకుండా నియోజకవర్గంలో పర్యటించాలని డిమాండ్ చేశారు.  మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లోనే పదిసార్లు దరఖాస్తు చేసుకున్న పెన్షన్  ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడం లేవని, మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగ్గా రావడంలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో వస్తె  ప్రజా సమస్యలను చూపిస్తామని అన్నారు.తెలంగాణాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలు నిధులను తెలంగాణా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామన్నారు.  

గ్రామాల్లోని సిసి రోడ్లకు, వైకుంఠ దామాలకు, వీధిలైట్లకు, కాంపోస్టు షెడ్యూలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నదని,కేంద్రం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ తామే చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారన్నారు. తెలంగాణాలో నిరంకుశ పాలననను అంతమొందించాలంటే ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలన్నారు. గ్రామంలో పడుతున్న బాధలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ , జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి ,అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి , మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వాజీద్ హుస్సేన్, బిజేపి  గంట అశోక్ , మండల ప్రధాన కార్యదర్శులు మహేష్ యాదవ్, కృష్ణ కాంత్ యాదవ్, నాయకులు ఉపాధ్యక్షులు రాజిరెడ్డి , కార్యదర్శి రవీందర్ , జిల్లా రజక సెల్ కన్వీనర్ దేవయ్య ,గణేష్, శ్రీనివాస్ రెడ్డి, విగ్నేష్ గౌడ్ , శ్రీశైలం, నాగుల శ్రీనివాస్ ,కార్తీక్ రెడ్డి, తిరుపతి రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.