వేములవాడ బీజేపిలో నాలుగు స్థంభాలాట..

వేములవాడ బీజేపిలో నాలుగు స్థంభాలాట..
  • ఎమ్మెల్యే బరిలో నలుగురు... 
  • పార్టీలో ఉండి ముగ్గురు.. పార్టీలో జాయిన్ కాకుండానే మరోకరు
  • వేములవాడ నియోజకవర్గంలో ఎవరి ప్రయత్నాలు వారికి
  • బండి సంజయ్ కూడా బరిలో ఉంటాడని గతంలో ప్రచారం

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీజేపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండేందుకు నలుగురు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వేములవాడ బీజేపిలో నాలుగు స్థంభలాట కొనసాగుతుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ప్రతాప రామకృష్ణది వేములవాడనే. ప్రస్తుతం వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బీజేపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు జడ్పీచైర్ పర్సన్ గా  పని చేసిన తుల ఉమ, బీజేపి రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్, మాజీ గవర్నర్, బీజేపి సినియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని వికాస్ రావ్ కూడా వేములవాడ బీజేపి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రతాప రామకృష్ణ, తుల ఉమ, ఎర్రం మహేశ్లు బీజేపి పార్టీలో ఉండి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. విద్యాసాగర్ రావు తనయుడు మాత్రం ఇంకా బీజేపిలో తీర్థం పుచ్చుకలోదు. ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడన్న సమాచారం ఇవ్వడం లేదు.

ప్రతిమ పౌండేషన్ తరుపున పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటు వికాస్ రావు నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నాడు. బీజేపి నుంచి పోటీలో ఉంటాడా.. మరో పార్టీలో చేరుతాడా ఎవరికి అంతుచిక్కడం లేదు. తుల ఉమకు వేములవాడ నియోజకవర్గంలో మంచి పేరుంది. కథలాపూర్, బీమారం, రుద్రంగిలో తుల ఉమకు మంచి పట్టు ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న  ప్రతాప రామకృష్ణ కు గతంలో ఒక చరిష్మా ఉన్న నాయకుడిగా పేరు ఉండేది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రతాప రామకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి.. భంగపాటుకు గురికావడంతో గ్రాప్ తగ్గిందని చర్చ కొనసాగుతుంది. వేములవాడ పట్టణం లో ప్రతాప రామకృష్ణకు పట్టు తప్పా.. మిగతా మండలాల్లో అంతగా ప్రభావం చూపరని రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఎర్రం మహేశ్ ముంపు గ్రామాల నాయకుడిగా.. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబును నేరుగా.. విమర్శించే వ్యక్తిగా.. గట్క్​ ఉన్న నేతగా నియోజక వర్గంలో పేరు సంపాదించాడు.ఉన్నది ఉన్నట్లు భయం లేకుండా మాట్లాడే వ్యక్తిగా పేరున్న.. నియోజకవర్గంలో రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. చెన్నమనేని వికాస్ రావుకు రాజకీయాలు కొత్త ఐన.. చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకుగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తావానికి బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఉన్న రాజకీయ వాతవరణం బీజేపికి అంతగా కలిసిరాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

గతంలో వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే బరిలో బీజేపి రాష్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఉంటాడని ప్రచారం జరిగిన.. ఉండకపోవచ్చు బీజేపి నాయకుల పేర్కొంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలో బీజేపి నేతలు ప్రెస్మీట్లు మినహా.. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనిచేసి బీజేపి పార్టీ బలోపేతం చేసే వారు కరువయ్యారని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైన వేములవాడ బీజేపి ఎమ్మెల్యే టికెట్ కోసం నలుగురు  ప్రయత్నాలు చేస్తున్నారు.