ఎన్డీయే – యూపీఏ సై

ఎన్డీయే – యూపీఏ సై
  • మహాఘట్​బంధన్​– సిల్వర్​జూబ్లీ
  • ఇరు కేంద్ర పార్టీల బలప్రదర్శనలో తగ్గేదేలే
  • ఏ పార్టీలు హాజరవుతాయో తెలియని పరిస్థితి

ముద్ర సెంట్రల్​ డెస్క్: మహాఘట్​బంధన్​తో ఓ వైపు నితీశ్, కాంగ్రెస్​లు అన్ని పక్షాలతో బీజేపీతో సై అని యుద్ధానికి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా, మరోవైపు ఎన్డీయే (నేషనల్​ డెమొక్రటిక్​ అలయెన్స్) ఏర్పడి 25 సంవత్సరాల గడుపుతున్న సందర్భంగా తమ మిత్రపక్షాలతో బీజేపీ పార్టీ ఈ నెల 18వ తేదీన సిల్వర్​జూబ్లీ వేడుకలు జరుపుకోనుండగా, దీన్ని కొందరు బలప్రదర్శనకు దిగడమని అనడం విశేషం. ఏది ఏమైనా ఇరుపార్టీల బలప్రదర్శనలో చిన్న పార్టీలు ఎటువైపు మొగ్గుచూపుతాయో అన్న విషయంపై స్పష్టత కరువైంది. ఆయా చోట్ల ఇప్పటికే పలు చిన్న పార్టీలు పెద్ద ఆశలు పెట్టుకోగా దేశంలో అధికారంలో లేని కాంగ్రెస్​ పార్టీ వాటిని తీర్చలేక బుజ్జగింపుల పర్వాలతో ముందుకు వెళుతోంది.

మరోవైపు కేంద్రంలో అధికారంతో ఉన్న ఎన్డీయే పార్టీ చిన్న పార్టీలకు అడిగిన వరాలిస్తూ రాబోయే ఎన్నికల్లో తమకు సహకరించాల్సిందిగా నయానో, భయానో హూకుం జారీ చేస్తోందనే వాదనలు వినబడుతున్నాయి. ఇటు కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మహాఘట్​బంధన్​–2 బెంగుళూరులో 17, 18వ తేదీల్లో విపక్షాలతో సమావేశం జరగనుంది. 18వ తేదీ ఎన్డీయేకు సహకరించే పక్షాలతో బీజేపీ న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్​లో సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) పెద్ద సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని, దీన్ని బీజేపీ బల నిరూపణగా కొందరు అభివర్ణిస్తుండగా, మరికొందరు కాంగ్రెస్​నేతృత్వంలోని విపక్షాల ఐక్యతను దెబ్బతీసే సమావేశంగా అభివర్ణిస్తున్నారు. ఈ సమావేశం కోసం ఇప్పటికే 10 నియోజక వర్గాలకు ఆహ్వానాలు కూడా పంపారు. ఆయా పార్టీలకు కూడా ఆహ్వానాలు అందాయి. పార్టీ జాతీయ నేతలు ఈ ఏర్పాట్లలోనే ఉండగా, మరోవైపు దేశరాజకీయాల్లో రానున్న ఎన్నికల్లో విపక్ష పార్టీల బలబలాలను బేరీజు వేసుకుంటూ ఆయా పార్టీలను రెండు అతిపెద్ద కేంద్ర పార్టీలు తమ దరికి చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎన్​డియే సమావేశానికి ఇప్పటి వరకు 19 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. 25 ఏళ్ల క్రితం మే 1998లో ఎన్డీయే ఏర్పడిందని, బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్​డీయేకి చైర్మన్ అని, ఎన్డీయే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 41 జాతీయ లేదా రాష్ట్ర పార్టీలు అందులో సభ్యులుగా ఉన్నాయన్న విషయాలను సుదీర్ఘంగా ప్రస్తావిస్తూ ఎన్డీయేతో చేతులు కలిపితే దేశాన్ని, తమ రాజకీయ భవితవ్యానికి ఎలాంటి ఢోకా ఉండబోదని ప్రకటించినట్లు సమాచారం. 

  • సమావేశానికి హాజరయ్యేందుకు ఆహ్వానాలు పంపిన పార్టీలను, సమావేశంలో పాల్గొంటాయని కూడా ఎన్​డీయే ప్రకటించింది. ఇందులో..

1. లోక్ జనశక్తి పార్టీ (ఎల్​జేపీ) (రామ్ విలాస్) (చిరాగ్​పాశ్వాన్​)
2. ఉపేంద్ర కుష్వాహా యొక్క లోక్ సమతా పార్టీ (ఎల్​ఎస్​పీ)
3. హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్​ఎఎం) (జితన్ రామ్ మాంఝీ)
4. నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా అప్నా దళ్ (నిషాద్)- నిషాద్ పార్టీ (సంజయ్ నిషాద్)
5. అప్నా దళ్ (సోనేలాల్) (అనుప్రియా పటేల్)
6. జననాయక్ జనతా పార్టీ (జెజెపి)- హర్యానా
7. జనసేన-, ఆంధ్రప్రదేశ్ (పవన్ కళ్యాణ్)
8. ఎఐఎడిఎంకె- తమిళనాడు
9. తమిళ్ మానిలా కాంగ్రెస్
10 ఇండియా మక్కల్ కల్వి మున్నేట్ర కజగం
11. జార్ఖండ్ ఏజెఎస్​యూ
12. ఎన్​సీపీ కాన్రాడ్ సంగ్మా
13. ఎన్​డీపీపీ ఆఫ్ నాగాలాండ్
14. ఎస్​కె ఆఫ్ సిక్కిం
15. మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్​ఎఫ్) ఆఫ్ జోరంతంగా
16. అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)
17. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్​బీఎస్​పీ) - ఓంప్రకాష్ రాజ్‌భర్
18. శివసేన (షిండే గ్రూప్)
19. ఎన్​సీపీ (అజిత్ పవార్ గ్రూప్)

ఆహ్వానంలో ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం, సాంస్కృతిక అహంకార పునరుద్ధరణ, ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని పటిష్టమైన విశ్వసనీయ శక్తిగా ప్రదర్శించడం కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇండియా విజన్–-2047తో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సభ ద్వారా బీజేపీ అఖండ సత్తా చూపుతుందని, విపక్షాలు ఏకమైతే తమకు అనేక పార్టీల మద్దతు ఉందని, మనం కూడా ఒక్కటేనని తేలిపోనున్నట్లు పేర్కొన్నారు.