సిరిసిల్ల లో చలిమెడదే చర్చ..

సిరిసిల్ల లో చలిమెడదే చర్చ..
  • వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు రాజకీయ భౌవితత్వంపై నీలి నీడలు
  • నిన్న వేములవాడలో రమేశ్బాబుకు పోటీగా కార్యాలయం ప్రారంభించిన చలిమెడ లక్ష్మీనరసింహారావు
  • నేడు మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్య ఇస్తూ.. స్టేజీ పైకి పిలిచి.. హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు పంపించిన వైనం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లో చలిమెడ కార్యకలపాలు..?
  • ఎమ్మెల్యే రమేశ్ బాబు మాటలు అదుపుతప్పడంతోనే.. అధిష్టానం సిరియస్..?
  • వేములవాడ ఎమ్మెల్యే బరిలో  అల్టర్నెట్ కాండిటేట్ గా చలిమెడ లక్ష్మీనరసింహారావు
  • వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు ప్రెస్మీట్... సిట్టింగులకే టికెట్లు అని సిఎం ప్రకటించారంటూ ప్రకటన
  • వేములవాడ బీఆర్ఎస్ పార్టీలో చలిమెడ హాట్ టాఫీక్.. ఏ లీడర్ వైపు ఉండాలో నాయకులు, కార్యకర్తల ఆయోమయం..

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీస్తున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు, వేములవాడ ఎమ్మెల్యే పదవిపై కన్నేసిన చలిమెడ లక్ష్మీనరసింహారావల వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాఫీక్ గా మారింది. చెన్నమనేని రమేశ్ బాబు వేములవాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలుపొందిన.. అప్పుడప్పుడు అధిష్టానంపై పలు ఆరోపణలు చేస్తూ.. నోరు జారిన విడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం.. వేములవాడ లో కొంత మంది నాయకులు రమేశ్ బాబు తీరును వ్యతిరేఖించడంతో.. రాజకీయ భౌవిష్యత్పై నీలి నీడలు అలుముకుంటున్నయన్న వార్తాలు వినవస్తున్నాయి. వేములవాడ నియోకవర్గం కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన చలిమెడ ఆనందరావు వైద్య, విద్యా సంస్థల అధినేత, ఇప్పటికే రాజకీయంగా మంచి పేరున్న చలిమెడ లక్ష్మీనరసింహారావు వేములవాడ నియోజవర్గంలో తన పని తాను చేసుకుపోతుండు. 

వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే పలు సామాజిక సేవల కార్యక్రమాలు, ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో ఉన్న లక్ష్మీనరసింహారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండతో వేములవాడ నియోజకవర్గంలో మరింత దూసకుపోతుండని రాజకీయ చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న చలిమెడ లక్ష్మీకాంతరావు ఉన్నట్లుండి.. మంగళవారం వేములవాడ పట్టణ కేంద్రంలో తాను సోంతంగా పార్టీ కార్యలయాన్ని ప్రారంభించాడు. వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను ఆ పార్టీ కార్యాలయం ప్రారంబోత్సవానికి పిలిచి సంచలన సృష్టించారు. ఎమ్మెల్యే రమేశ్ బాబు ఇలాకాలో ..  ఎమ్మెల్యేను కాదని, ఆయన క్యాంపు ఆఫీస్కు కూతవేటు దూరంలోనే మరో పెద్ద కార్యాలయాన్ని ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారీ తీయగా..తాజాగా బుదవారం మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశక్ రాష్ట్రానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కార్యక్రమం జరగగా మంత్రి కేటీఆర్ చలిమెడకు అతి ప్రాధాన్యం ఇచ్చి.. గుర్తు చేసి మరి స్టేజీ పైకి పిలుపించుకున్నాడు. 

లక్ష్మీనరసింహారావుతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏనుగు మనోహర్ రెడ్డి కూడా వేములవాడ ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తుండగా మనోహర్ రెడ్డిని కూడా స్టేజీ పైకి పిలిపించి కుర్చిల్లో కూర్చోబెట్టాడు. సిరిసిల్ల తనకు కార్యక్రమాలు ఎక్కువగా ఉండటంతో చలిమెడ లక్ష్మీనరసింహారావును వైవి సుబ్బారెడ్డి తో హెలిక్యాప్టర్లో కూర్చబెట్టి సుబ్బారెడ్డితో తోడుగా హైదరాబాద్ వరకు వెళ్లి సాగనంపాలని లక్ష్మీనరసింహారావును పనిని అప్పగించారు. దీంతో సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారు. ఒక్క రోజు ముందే వేములవాడ ఎమ్మెల్యేకు పోటీగా పార్టీ కార్యాలయం ప్రారంభించిన వ్యక్తిని.. మరుసటి రోజే అతి ప్రాధాన్యం ఇస్తూ.. స్టేజీ పైకి గౌరవంగా పిలుచుకోవడం.. కార్యక్రమంలో పక్కనే ఉంచుకోవడం.. ఏకంగా హెలిక్యాపర్లో .. ఎక్కించి సుబ్బారెడ్డితో హైదారాబాద్ పంపించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తుంది.

వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బాబుకా... లేక లక్ష్మీనరసింహారావుకు కన్ ఫర్మ్ చేసి.. పరక్షంగా తెలియకుండా అధిష్టానమే.. వేములవాడలో తన పని చేసుకొమ్ముని ఏమైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైన వేములవాడ రాజకీయాల్లో చలిమెడ లక్ష్మీనరసింహారావ్ హాట్ టాపీక్ గా మారారు.  ఇది లా ఉండగా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు ప్రెస్మీట్ ఏర్పాటు వేములవాడ అభివృద్ది విషయం ప్రకటించి విలేకరులు అడిగిన ప్రశ్నకు .. సిట్టింగులకే టికెట్లు అంటూ సిఎం కేసీఆర్ చెప్పారు.. మధ్యలో ఇచ్చి.. పార్టీకి సంబంధం లేకుండా ఎవరు ఏం కార్యక్రమం నిర్వహించుకున్న నేను పట్టించుకోను అంటూ పేర్కొనడం విశేషం.