అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల టౌన్, ముద్ర: పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం "పోలీస్ ఫ్లాగ్ డే " సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ వరకు  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని, అక్టోబర్ 21న చందుర్తి మండలం లింగంపేట్ గ్రామ శివారులో గల  పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగానివాళులు అర్పిస్తూ "స్మృతి పరేడ్" నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని కేటగిరి-1లో ఇంటర్మీడియట్  స్టూడెంట్స్ కు సమర్థవంతమైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కేటగిరి-2లో  డిగ్రీ, పిజి విద్యార్థులకు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం లో పోలీస్ పాత్ర అనే అంశాల మీద విద్యార్థులకు ఆన్లైన్లో https://forms.gle/b7bejvzfo6j29Vuz6 వెబ్ సైట్ నందు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. రచనలను ఆన్ లైన్ లో 24 అక్టోబర్ 2023 వరకు సమర్పించవచ్చును అని తెలిపారు. అలాగే పోలీసు సిబ్బందికి  వ్యాసరచన పోటీలలో భాగంగా కేటగిరి-1: కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు పోలీసులకు పని -జీవిత సమతుల్యత, కేటగిరి-2: ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు సమాజం లో లింగ సమానత్వాన్ని కాపాడడంలో పోలీస్ పాత్ర అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు.  వీటితో పాటు రక్తదాన శిబిర కార్యక్రమాలు, పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడంతో పాటు ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు : 

జిల్లా పరిధిలో విద్యార్థిని విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు మించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని,  ఫోటోలు, వీడియోలు ఈనెల 24 తేదీ లోపు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో అందించాలని తెలిపారు. అన్ని పోటీలలో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున బహుమతుల ప్రధానం చేసి, తదుపరి ఈ ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.