కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి - దొమ్మాటి నరసయ్య

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి - దొమ్మాటి నరసయ్య

ముద్ర, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మంగళవారం పార్టీ కార్యాలయంలోజరిగింది .ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీ స్థాయి నుండి మండల కమిటీల వరకు పటిష్ట పరిచి క్యాడర్ను పెంచాలన్నారు. అంతేకాకుండా గ్రామాలలో యువకులను చేర్చుకుంటూ పార్టీలో  చేరుతా మంటున్న బిఆర్ఎస్,  బిజెపి  పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో కలుపుకోవాలన్నారు. కొత్తవారికి అవకాశం ఇచ్చి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తాను  చాటాలనారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి  వంగ గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్, నాయకులు కొత్తపల్లి దేవయ్య ,దండు శ్రీనివాస్, పరుశరాములు, తిరుపతిరెడ్డి, కోనేటి పోచయ్య ,గంటబుచ్చా గౌడ్  ,చెన్ని బాబు, తిరుపతి గౌడ్ ,రాజేందర్,  అనవేని రవి ,రమేష్, లక్ష్మీనరసయ్య,  తదితరులు పాల్గొన్నారు.