శ్రీ శివ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు

శ్రీ శివ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు


ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణం లోని శ్రీ శివ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి పండగను పురస్కరించుకొని నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ, అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ శ్రీ శివ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. శివ సాయి బాబా వారి కృప తో  ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని బాబాను కోరుకున్నానని అన్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అదే విధంగా మంత్రి కేటీఆర్ మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ వారి వారి దేవాలయాలలో వివిధ అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించుకునేల ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని, సిరిసిల్లలోని ప్రధానమైన దేవాలయాలలో పాలకమండలి లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ అభివృద్ధిని మరింత వేగవంతం చేశారని అన్నారు. 

అన్ని దానాలలో అన్నదానం మహా గొప్పదని ఈరోజు ఈ శివ సాయి బాబా దేవాలయం సన్నిధిలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని మా చేతుల మీదగా ప్రారంభించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. అనంతరం శ్రీ శివ సాయి బాబా దేవాలయ ప్రధాన అర్చకులు, అధ్యక్షులు మామిడాల కృష్ణ, ధర్మకర్త కొక్కుల ఆంజనేయులు, ఆలయం ఈవో మారుతి లు జిందం కళ చక్రపాణి దంపతులను అలాగే  కౌన్సిలర్ సభ్యులు భూక్యా రెడ్డి నాయక్, అన్నారం శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దార్ల సందీప్, అడ్డగట్ల మురళి లను శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాల లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ అధ్యక్షులు ఉప్పుల విట్టల్ రెడ్డి, శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం అధ్యక్షులు సిరిగిరి మురళి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.