ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఆందోళన

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఆందోళన

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ పీహెచ్డీ. PG &PHD విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం ప్రధాన ద్వారం వద్ద గేటు ముందు రోడ్డు పై కూర్చొని  నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరిశోధనకు కనీస సౌకర్యాలు కల్పించకుండా రీసెర్చ్ పేపర్ ను సబ్మిట్ చేయాలని నిబంధనను కొత్తగా విధించారన్నారు దీని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాయినింగ్ సమయంలో గతంలో 5నమ్మ్స్  ఉండే కొత్తగా సిక్స్ నామ్స్ రేటింగ్ పై ప్రచురిస్తేనే తీసుకుంటామని వెల్లడిస్తున్నారని తెలిపారు.

 పరిశోధనలకు ఎలాంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ ఆర్టికల్చర్  విద్యాభ్యాసం విద్యార్థులకు శాపం గా మారిందన్నారు విద్యార్థుల స్థాయి ఫండ్ సైతం అంతంత మాత్రమే ఉందన్నారు తమ సమస్యల సాధన కోసం ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు. పక్క రాష్ట్రం మైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో  10 వేలు   ఇస్తున్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో 7000 మాత్రమే ఇస్తున్నారని తేలిపారు.