బస్ ప్రారంభం | TSRTC started new bus service in Rajanna Sircilla

బస్ ప్రారంభం | TSRTC started new bus service in Rajanna Sircilla
  • పదిర గ్రామం నుండి వీర్నపల్లి మోడల్ స్కూల్ వరకు
  • ప్రారంభించిన పదిర సర్పంచ్ వజ్రమ్మ

ముద్ర, ఎల్లారెడ్దిపేట : పదిర గ్రామం నుండి  నుండి వీర్నపల్లి మాడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థుల కోసం బస్సుకు మంగళవారం సర్పంచ్ కుంబాల వజ్రమ్మ కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించారు. అనంతరం బస్సు డిపో మేనేజర్ కు ఫోన్ చేసి మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్ వరకు బస్సును నిర్విరామంగా నడపాలని కోరారు. అందుకు  డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి ఈ అకాడమిక్ ఇయర్ వరకు నిరంతరంగా  బస్సు నడుపుతామని పేర్కొన్నారు. పదిర నుండి వెళ్లే విద్యార్థులకు తొందరగా బస్సు పాసులు ఇవ్వాలని  కోరారు.అనంతరం బస్సులో ప్రయాణం చేసి మొదటి రోజు మొత్తం  విద్యార్థులకు మాజీ సెస్ డైరెక్టర్ మల్లారెడ్డి టికెట్  తీసుకున్నారు. నిన్నటి రోజు పదిరకు బస్సు రావడం కోసం ఫ్రీ బస్సు పాసుల కోసం 5 వేల విరాళాన్ని సర్పంచ్ కుంబాల వజ్రమ్మ సిరిసిల్ల డిపోకు అందించారు.