అన్నదాతలను ఆదుకొని ప్రభుత్వం - కేకే మహేందర్ రెడ్డి     

అన్నదాతలను ఆదుకొని ప్రభుత్వం - కేకే మహేందర్ రెడ్డి     

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైన ఇప్పటికి వడ్ల కొనుగోలు కేంద్రాలలో తడిసిన మొలకెత్తిన వడ్లు తూకం వేయకుండా అలాగే ఉన్నాయి అన్నారు.

ఈ ప్రభుత్వం మాయ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుందన్నారు. మంత్రి కేటీఆర్ రైతుల బాధలను పట్టించుకోకుండా నియోజకవర్గానికి రాకుండా తిరగడం జరుగుతుందన్నారు. శతాబ్ది ఉత్సవాల పేరిట రైతులు సంబరాలు జరుపు కోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు. ఒక వైపు రైతులు అకాల వర్షాల మూలంగా పంటలు దెబ్బతిని వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం చేసే నాథుడు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయంలో ప్రభుత్వంతో సంబరాలు జరుపుకోవడానికి ఎలా ముందుకు రావడం జరుగుతుందన్నారు.

ఒక వైపు రైతులు కన్నీరు కారుస్తుంటే మరోవైపు ప్రభుత్వం సంబరాలకు సన్నద్ధం కావడం సిగ్గుచేటు అన్నారు. రైతుల పైన ప్రేమ ఉంటే ధాన్యపు గింజ లేకుండా కొనుగోలు కేంద్రాల నుండి తరలించి సంబరాలు చేసుకుంటే సంతోషమన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,చిన్ని బాబు,కొత్తపల్లి దేవయ్య, మానక నాగరాజ్ యాదవ్, బానోత్ రాజు నాయక్, చెరుకు ఎల్లయ్య,బి పేట రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.