అభివృద్ధిలో భారతదేశానికి తెలంగాణనే దిక్సూచి..

అభివృద్ధిలో భారతదేశానికి తెలంగాణనే దిక్సూచి..

ముద్ర, గంభీరావుపేట: ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో భారతదేశానికి తెలంగాణనే దిక్సూచి అని నా ప్స్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. శుక్రవారం క సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నా ప్స్కాబ్ చైర్మన్ రవీందర్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నా ప్స్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మ గౌరవంతో రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో  బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింద‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు స్వంత జాగా ఉన్న వారు స్వ‌యంగా వారే డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకునేందుకు ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేస్తుంద‌న్నారు. 


అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్  ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతుల‌కు రైతుబంధు, వృద్దులు, వితంతువులు, వికాలాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, బీడీ కార్మికుల‌కు ఫించ‌న్లు అంద‌జేస్తున్నామ‌ని,  సాగు, సాగు నీటి క‌ష్టాలు తీరినాయ‌ని, క‌రెంట్ కోతలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఇంటింటికీ న‌ల్లా నీళ్లు అందిస్తున్నామ‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డ లేని విధంగా సీయం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలోని పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన, మైనార్టీ, ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ జడ్పిటిసి విజయ, చెస్ డైరెక్టర్ నారాయణరావు జడ్పీ కోఆప్షన్ హైమద్, సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ కవిత, రైతుబంధు కోఆర్డినేటర్ రాజేందర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలవ్వా , నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ రాజు, శంకర్ గౌడ్, ఎగదండి స్వామి ,లింగం యాదవ్, మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.