అక్షయ పరిస్థితి విషమం.!

అక్షయ పరిస్థితి విషమం.!
  • ప్రహరి గోడ కూలి తల్లి దుర్మరణం చెందగా కూతురు అక్షయ పరిస్థితి విషమంగా ఉంది
  • ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని తోటి విద్యార్థినిలు గుళ్లో ప్రత్యేక పూజలు

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరే దేవవ్వ  36,కూతురు అక్షయ 16, తండ్రి నరసయ్య, తమ ఇంటి కాంపౌండ్ వాల్ ఆనుకొని  తమ వద్ద మిగిలి ఉన్న ఇసుకను పోయడంతో ఒకవైపు బరువు కావడంతో ఒక్కసారిగా ప్రహరి  గోడ కూలి తల్లి కూతుర్ల పై పడగా వెంటనే స్థానికులు భర్త నరసయ్యతో కలిసి క్షతగాత్రులను బయటకు తీసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ చికిత్స పొందుతూ తల్లి మరణించగా కూతురుకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి  తరలించి వైద్యం అందిస్తున్నప్పటికీ అక్షయ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది. కుటుంబంలో తల్లి మరణించగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అక్షయను చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అక్షయ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కాగా తోటి విద్యార్థులు తొందరగా ఆరోగ్యం బాగుపడాలని గుళ్లో దేవునికి ప్రార్థిస్తున్నారు