ముస్తాబాద్కు 30 పడకల ఆస్పత్రి  మంజూరు

ముస్తాబాద్కు 30 పడకల ఆస్పత్రి  మంజూరు

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి 30 పడకల ఆస్పత్రిని మంజూరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో పాటు ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.10 కోట్లు నిధులు విడుదల చేసింది. ముస్తాబాద్ ఆస్పత్రి మంజూరి చేసినందుకు మంత్రి కేటీఆర్కు ఎంపిపి జనగామా శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఏంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరక్టర్ అంజిరెడ్డి, సీనియర్ నాయకుడు గోపాల్రావు హర్షం ప్రకటించారు.