ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ పై అవగాహనా పెంచుకోవాలి...

ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ శిక్షణ పై అవగాహనా పెంచుకోవాలి...
  • రోడ్ ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తులకి గుడ్ సమర్టిన్ అవార్డ్స్...
  • రాష్టంలోనే జిల్లాలో మొదటి సారిగా గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలు ఏర్పాటు...
  • ఎస్పీ అఖిల్ మహాజన్..

 ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రోడ్ ప్రమాదాలు జరిగిన వెంటనే యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పండర్ స్పందించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం గాని ప్రమాద తీవ్రతను గుర్తించి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రజల  ప్రాణలను కాపాడటానికి ఎంతగానో సహాయపడతారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ అఖిల్ మహజేన్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మరణాలు 98 శాతం  రోడ్ ప్రమాదాల వలన జరుగుతున్నాయి అని,రోడ్ ప్రమాదాల్లో గాయపడిన ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో రాష్టంలోనే మొదటి సారిగా ప్రతి గ్రామంలో 05 గురు సభ్యులతో కూడిన రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కమిటీలకు, జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ బంక్, దాబా,హోటల్స్ లలో పని చేసే  200 మందిని గుర్తించి వారికి  నెలకు ఒకసారి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోని డాక్టర్స్ ద్వారా ఫస్ట్ ఎయిడ్,సిపిఆర్ మరియు ఏడిఈఅనే మొదలగు అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని  అన్నారు.

రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలో స్వచ్ఛందంగా చేరి శిక్షణకు వచ్చిన వాలంటీర్స్ శిక్షణ నేర్చుకుని,మీ ఫ్రెండ్స్ కు బంధువులకు మరియు ప్రమాదాలు జరిగినప్పుడు  ప్రధమ చికిత్స ఎలా చేయాలో అనే అంశాలు తెలియపరచాలని,రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ యెక్క పూర్తి వివరాలు వారి వారి గ్రామపంచాయతీ లో ఏర్పాటు చేస్తామని అన్నారు.వారి పరిధిలో ఎక్కడ రోడ్ ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం గాని ప్రమాద తీవ్రతను గుర్తించి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రజల  ప్రాణలను కాపాడటానికి ఎంతగానో సహాయపడతారని అన్నారు.శిక్షణ వల్ల అత్యవసర సమయంలో ఒక్కరినీ కాపాడిన వారి పై ఆధారపడిన కుటుంబాన్ని మొత్తం ను కాపాడిన వారు అవుతారని అన్నారు. రోడ్ ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తులకి గుడ్ సమర్టిన్  అవార్డ్స్ మరియు రివార్డ్స్ ను జనవరి 26,జూన్ 2 మరియు ఆగస్ట్ 15 నమంత్రి  చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుంది అని, ఆ గోల్డెన్ అవర్ సమయంలో సాధ్యమైనంత వరకు కష్టపడి ఆ వ్యక్తిని బతికించవచ్చని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కి తరలించి వారి  ప్రాణాలు కాపాడడం ముఖ్యమని తెలిపారు.పోలీసులు ప్రజలు యువకులు, సమన్వయంతో  ఉన్నప్పుడు ప్రమాదాలను నివారించడం సులభం అవుతుందన్నారు.

 రోడ్డు ప్రమాదాలు తగ్గించడం గురించే వాహనాలు తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ నడిపేవారు  సీట్ బెల్ట్ ధరించాలని  సూచించారు. అత్యవసర పరిస్థితి ఎలా గుర్తించాలి, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు  క్షతఘాత్రులకు ప్రధమ చికిత్స చేయడం ఆసుపత్రికి తరలించడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  చాతి నొప్పి,  తదితర అంశాల గురించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా బతికించవచ్చు అంశాలను అవగాహన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు  అవగాహన కల్పించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ,జిల్లా పోలీస్ యంత్రగానికి కృతజ్ఞతలు తెలియజేశారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి  ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్  ఇంజనీరింగ్ ఎమర్జెన్సీ కేసెస్ ఇవి చాలా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య ,డిఎస్పీ నాగేంద్రచారి, రవికుమార్, సిఐ లు ఎస్ఐ లు వివిధ గ్రామాల నుండి వచ్చిన వాలంటరీ లు పాల్గొన్నారు.