నేడు సిరిసిల్లకు బలగం సినిమా బృందం

నేడు సిరిసిల్లకు బలగం సినిమా బృందం

హజరుకానున్న వేణు యెల్ధండి, హిరో, హిరోయిన్లు ప్రియదర్శి, కావ్య

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్ననసిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్ములనకు విద్యార్థులు ,ఉపాధ్యాయులతో కలసి యాంటీ డ్రగ్స్ క్లబ్ ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన యాంటి డ్రగ్స్ క్లబ్  ప్రారంభ కార్యక్రమానికి మధ్యామ్నం 2 గంటలకు  ముఖ్య అతిధులుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు ఈ మధ్య ప్రజల మన్ననలు పొంది.. 100 అవార్డులు సోంతం చేసుకున్న బలగం సినిమా చిత్ర యూనిట్ సభ్యులు హజరుకానున్నారు. డైరక్టర్ వేణు యెల్ధండి, హిరో ప్రియదర్శి, హిరోయిన్ కావ్య ఇతర నటి నటులు హజరుకానున్నారు.

మాధక ద్రవ్యాలతో యువత చెడుదార పడుతున్న నేపధ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పలు సామాజిక రుగ్మతలపై పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు.