మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి...

మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి...

కలెక్టర్ అనురాగ్ జయంతి..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి - 9 లో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ ను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ను త్వరలో సిఎం కేసిఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ -9 పూర్తయిందని, ఇదివరకే ట్రయల్ రన్ లో భాగంగా రెండు పంపులు సక్సెస్ అయ్యాయని అన్నారు.

ఈ రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుందని, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. హెలిప్యాడ్ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూమ్, పైలాన్ ను ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని అన్నారు. ప్రాజెక్టు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతకముందు నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కలెక్టర్, ఎస్పీ సందర్శించి,ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ నాగేంద్ర చారి, ఎస్ డీసీ గంగయ్య, డీఈ లు, తదితరులు ఉన్నారు.