సిరిసిల్ల బీఆర్ఎస్ కు షాక్..

సిరిసిల్ల బీఆర్ఎస్ కు షాక్..
  • కాంగ్రెస్ లోకి నలుగురుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు
  • బీఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై అసంతృప్తితో కాంగ్రెస్ లోకి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో క్యాడర్ అసంతృప్తితో కాంగ్రెస్ బాట పడుతున్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ క్యాడర్ లో నెలకొన్ని అసంతృప్తిని తొలగించడంతో.. నాయకులతో కొఅర్డనేట్ చేయడంతో జిల్లా నాయకత్వం విఫలమవడంతో బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్, మాజీ కౌన్సిలర్ యెల్లె లక్ష్మీ నారయణ, కాంగ్రెస్ సిరిసిల్ల రూరల్ మాజీ అధ్యక్షులు వైద్య శివ ప్రసాద్, నాయకులు మ్యాన ప్రసాద్, కోడం శ్రీనివాస్ లు సోమవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మూడు నెలల క్రితమే 22 మంది మాజీ కౌన్సిలర్లతో యెల్లె లక్ష్మీనారయణ సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ తమను పట్టించుకోవడం లేదని, జిల్లా నాయకత్వం కూడా మాజీ కౌన్సిర్లకు విలువ ఇవ్వడం లేదని చర్చించారు. కాంగ్రెస్ లో చేరడానికి సమావేశం ఏర్పాటు చేసిన విషయం బీఆర్ఎస్ నాయకత్వానికి తెలిసిన పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమైందని తెలిసింది. ఆలస్యంగా తేరుకున్న బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ మూడు రోజుల క్రితం కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ సభ వద్దకు అసంతృప్తి నాయకులు యెల్లె లక్ష్మీనారయణను, కొండ శ్రీనివాస్ను తీసుకెల్లి కలిపించారు. ఈ విషయం తెలుసుకున్న నామీనేట్ పోస్టు నేత యెల్ల లక్ష్మీనారయణపై ఆగ్రహం వ్యక్తి చేసి దూసించినట్లు సమాచారం. నాకు తెలియకుండా కామారెడ్డికి ఎందుకు వచ్చారు .. నాకు తెలియకుండా రాజకీయాలు చేస్తారా మీ సంగతి చూస్తా అని నోటీకి పని చెప్పడంతో యెల్లె లక్ష్మీనారయణ కూడా దీటుగా సమాధానం ఇచ్చి.. కేటీఆర్పై అభిమానంతో పని చేయడానికి బీఆర్ఎస్ లోకి వచ్చామని.. నీ బెదిరింపులకు తాము భయపడమని, పార్టీలో ఉంటే ఉంటాం లేకుంటే లేదు అని కోపంతో వెళ్లి సోమవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి బయలుదేరి వెళ్లారు.