అభివృద్ధి కోసం అందరూ కలసి రావాలి..

అభివృద్ధి కోసం అందరూ కలసి రావాలి..
  • జడ్పీటీసీగట్ల మీణయ్య..
  • మొదలైన రోడ్డు వెడల్పు పనులు..

ముద్ర,రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో మంగళవారం రోజు నుండి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం అయినట్టు జడ్పిటిసి గట్ల మీనయ్య తెలిపారు...ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని అన్నారు.మొన్నటి వరకు వర్షాలు ఉన్నందున పనులకు ఆటంకం కలిగిందని అన్నారు.ప్రతిపక్ష నాయకులు రాజకీయా లబ్ది కోసం విమర్శలు చేయడంమని అభివృద్ధి లో కలిసిరావలని కోరారు.ఎమ్మెల్యే రమేష్ బాబు కు ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో తెలుసని ప్రతిపక్ష లు గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.రోడ్డు వెడల్పు పనులకు ఆర్ అండ్ బి అధికారులకు మండల ప్రజలు సహకరిస్తే రోడ్డు పనులు త్వరగా పూర్తవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో,మార్కెట్ వైస్ ఛైర్మన్ కంటే రెడ్డి,కో అప్సన్ జమిలా బేగం,ఎంపిటిసి మంచే రాజేశం,గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,వర్డ్ మెంబర్ చెప్యాల గణేష్,గొళ్ళెం నర్సింగ్,మ్యాకాల రాజేందర్,నాయకులు పొగుల నర్సయ్య,కదాసు లక్ష్మణ్,దయ్యాల నారాయణ,తదితరులు పాల్గొన్నారు.....