రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య విద్య కళాశాల ప్రారంభం హర్షనీయం - జక్కని నవీన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య విద్య కళాశాల ప్రారంభం హర్షనీయం - జక్కని నవీన్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభమనేది వైద్య విద్యలో ప్రవేశించాలని ఆశిస్తున్న విద్యార్థులకు అలాగే  ఇక్కడి ప్రజలకు ఇది ఎంతో మేలు చేసే చారిత్రక సంఘటన అని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి దశలో ఇది మరో కలికితురాయి అని పద్మశాలి టీచర్ వెల్ఫేర్ సంఘం జిల్లా అధ్యక్షులు దేవత ప్రభాకర్ మరియు ప్రధాన కార్యదర్శి జక్కని నవీన్ లు పేర్కొన్నారు.
ఎంబిబిఎస్ చేయాలని వైద్య వృత్తిలో ప్రవేశించాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఎనిమిది మెడికల్ కళాశాలలో ప్రారంభించడం అనేది అద్భుతమని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జిల్లా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య కళాశాలనే కాకుండా నర్సింగ్ కళాశాల ప్రారంభం కావడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కళాశాల కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు కావడం ఇలా విద్యారంగంలో జిల్లాను ముందుకు తీసుకెళుతున్న కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలోని మొట్టమొదటి కేజీ టు పీజీ పాఠశాలను గంభీరావుపేటలో నెలకొల్పడం జరిగిందని, ఎల్లారెడ్డిపేట హైస్కూల్ గీతానగర్ హై స్కూల్ తో సహా మరికొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరచడం జరిగిందని మరియు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు ఇలా జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలు అలాగే పద్మశాలీల కు సంబంధించి అప్పెరల్ పార్కు, పద్మశాలి మరమగ్గాల కార్మికులకు పని కల్పించే విధంగా బతుకమ్మ చీరలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన బట్టల తయారీ కూడా సిరిసిల్లకు వస్తుండడంతో నేతన్నల జీవితాలలో సంతోషాన్ని నింపుతుందని పేర్కొన్నారు.సిరిసిల్ల జిల్లాలోని ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఈ కార్యక్రమాల వల్ల పెరుగుతుందని భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందనుందని దీనికి చొరవ తీసుకుంటున్న కేటీఆర్ గారికి పద్మశాలి టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.