కల్లూరి జన్మదినం పురస్కరించుకొని తార్పాలిన్ కవర్ల పంపిణీ

కల్లూరి జన్మదినం పురస్కరించుకొని తార్పాలిన్ కవర్ల పంపిణీ

ముద్ర తుర్కపల్లి న్యూస్ : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా  మండలం దత్తాయ పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తార్పాలిన్ కవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పెంకుటిండ్లలో నివాసం ఉంటు ఇల్లు కురుస్తున్న నిరు పేదలకు తార్పాలిన్ కవర్లను అందజేసినట్లు చెప్పారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంను పూర్తిగా విస్మింరించారని విమర్శించారు. నిరుపేద కుటుంబాలకు కనీసం తార్పలిండ్లను పంపిణీ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తున్నామని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల నాయకులు, స్థానిక వార్డు సభ్యులు జేరిపోతుల చంద్రయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట భాస్కర్  యువజన కాంగ్రెస్ నాయకులు గుండ హరిబాబు నాయకులు, గ్రామస్థులు,ఎండి జమీల్ ,గుజ్జ రాజమల్లయ్య, దేవరుప్పుల కిష్టయ్య,జేరిపోతుల శంకర్, కోట రాములు,మాతయ్య పల్లపు రుక్మయ్య, కోట వేణు తదితరులున్నారు.