కుల సమీకరణలు అభ్యర్థులకు కలిసొచ్చేనా.....

కుల సమీకరణలు అభ్యర్థులకు కలిసొచ్చేనా.....

ఆలేరు (ముద్ర న్యూస్):ఆలేరు శాసనసభ స్థానం 97 కు నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అయిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. బీర్ల అయిలయ్య. పడాల శ్రీనివాస్ లు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని తమ సామాజిక వర్గాల తో పాటు ఇతర సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుని రానున్న ఎన్నికలలో విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐలయ్య కుల రాజకీయాలు చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు పోరాటంగానే ప్రచారం చేస్తున్నప్పటికీ తమ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు మాజీ శాసనసభ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ నేతృత్వంలో గౌడ సామాజిక వర్గంతో ప్రత్యేక సమావేశం ఇటీవల నిర్వహించారు. వంగపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ సామాజిక వర్గం ముఖ్య నాయకులతో బిఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించినట్లు విశ్వాసనీయ సమాచారం.

ఇటీవల ఆలేరు పట్టణ కేంద్రంలోని ఇమ్మడి ఫంక్షన్ హాల్ లో మోటకొండూర్ జడ్పిటిసి సభ్యులు పల్ల వెంకట్రెడ్డి కుమార్తె నిశ్చితార్థం పేరుతో రెడ్డి సామాజిక వర్గంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గొల్ల. కురుమల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రత్యేకంగా యాదవ్ లతో సమావేశం ఏర్పాటు చేసి తమ వైపు తిప్పుకునేందుకు బిఆర్ఎస్ నేతలు బావులు కదుపుతున్నారు. ప్రధానంగా బీర్ల అయిలయ్య తన సామాజిక వర్గంతో పాటు బీసీల ఐక్యతే ఎజెండాగా పనిచేస్తూ రెడ్డి సామాజిక వర్గంలోని గొంగిడి వ్యతిరేకులతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసి అనేక ఆటుపోట్లను. అణచివేతలకు గురై బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న ఉద్యమకారులను పోగుచేసి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీగా పని చేసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులు మరియు బిఆర్ఎస్ బహిష్కృత నేత పడాల శ్రీనివాస్ గత ఎన్నికలలో తన మండలంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి అత్యధిక మెజార్టీ అందించే నియోజకవర్గంలోనే తనదైన ముద్ర వేస్తున్న పడాల శ్రీనివాస్ ప్రధాన జరిగిన రాజకీయ పరిణామాలతో బొంగిడి దంపతులకు బద్ధ శత్రువు అయి బిజేపీలో చేరారు.

తనకు వ్యతిరేకంగా పడాల శ్రీనివాస్ పనిచేస్తే ఓటమి ఖాయమని భావించిన బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో మాట్లాడే పడాల శ్రీనివాస్ కు టికెట్ వచ్చే విధంగా చక్రం తిప్పారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. గత రెండు పర్యాయాలు ఆలేరు శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆలేరుకు ప్రధాన జలవనారులుగా ఉన్న గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణంపై ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారమే ప్రధాన విమర్శతో పాటు ఆలేరు రెవిన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు అయినట్లు ప్రకటించి వెనక్కి వెళ్లడాన్ని నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా చర్చిస్తున్నారు. నియోజకవర్గం 30 పడకల హాస్పిటల్ ను వంద పడకల హాస్పిటల్ గా ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు నిరంతరం డిమాండ్ చేస్తున్నప్పటికీ 30 పడకల హాస్పిటల్ ను 15 పడకల హాస్పిటల్ గా కుదించిన ఘనత గొంగిడి దంపతులకు దక్కుతుందని నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆలేరు పట్టణ కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం అఖిలపక్ష కమిటీ చేసిన ఆందోళనను నివారించేందుకు పోలీసులతో లాటి చార్జి చేయించిన విషయాన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం పోరాటాన్ని అడ్డుకునేందుకు బొమ్మిడి సునీత మహేందర్రెడ్డి ఉద్యమకారులపై లాటిచార్జి చేయించిన మొక్కవోని ధైర్యంతో పోరాటాన్ని ముందుకు నడపడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి అనేక సంవత్సరాలు కావస్తున్నా పూర్తి చేయకుండా పట్టణ ప్రజలను అనేక ఇబ్బందులను గురి చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రైల్వే గేట్ అవతలి వైపు ఉన్నవారు కనీసం మరణిస్తే భౌతిక దేహాన్ని తీసుకువెళ్లేందుకు కూడా అక్కడి ప్రజలు పడుతున్న బాధలు ఎమ్మెల్యే గుర్తించి. అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేయకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్లు బాగుంటే తెలంగాణ లేకుంటే ఇతర రాష్ట్రాలు అని బహిరంగంగా ప్రకటిస్తున్న విషయాన్ని ఇక్కడి ప్రజలు తాము ఏ రాష్ట్రంలో ఉన్నాము సాక్షాత్తు శాసనసభ సభ్యురాలు ప్రకటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఆలేరు మండలంలోని పలు గ్రామాలతో పాటు రాజపేట మండలంలోని అనేక గ్రామాలు. గుండాల మండలంలోని పలు గ్రామాలు. మోట కొండూర్ మండలంలోని గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయా సాక్షాత్తు గొంగిడి దంపతులు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నప్పటికీ కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా. ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా గొంగిడి దంపతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఆలేరు పట్టణంలోని డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో సైతం అర్హులైన పేదలకు అన్యాయం చేసి గులాబీ కండువాలు కప్పుకున్న వారికే కట్టబెట్టారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కంపెనీలో జరిగిన అన్యాయాలను ఎదిరించిన అనేకమంది మహిళలపై అక్రమ కేసులు బనాయించారని సాక్షాత్తు మహిళలు ఆరోపణలు చేస్తూ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ వ్యాపార కేంద్రం ముందు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతమైనవారనే విషయం అనేక సందర్భాలలో రుజువు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి డాక్టర్ కుడుదుల నగేష్ ను శాసనసభకు పంపించి తెలంగాణ ఉద్యమాన్ని చాటిన ఘనత ఇక్కడి ప్రజలకు ఉంది. ఆలేరు నియోజకవర్గం నుండి భువనగిరి. రామన్నపేట. జనగాం. ఉప్పల్ లాంటి నియోజకవర్గం వర్గాలకు శాసనసభ సభ్యులుగా ఎన్నికై ప్రజల మన్ననలు పొందిన నేతల జన్మస్థలం ఆలేరు నియోజకవర్గం. అలాంటి చైతన్యవంతమైన ప్రజలు నవంబర్ 30న జరిగే ఎన్నికలలో ఎవరికి పట్టం కడతారని విషయాన్ని డిసెంబర్ 3న ప్రకటించే ఫలితాలలో బయటపడనుంది.