ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తాం: సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు 

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తాం: సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు 

ముద్ర ప్రతినిధి భువనగిరి: ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరి ష్కారం చేయకపోతే సమ్మెకు వెళ్తామని సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు దాసరి  పాండు  హెచ్చరించారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి మండల  తహసిల్దార్ కి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని లేదంటే సమ్మెకు వెళ్తామని సమ్మె నోటీసు అందజేశారు.

 ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషకాల పేరుతో ఆశ వర్కర్లతోని వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని ఉన్నారు.  గ్రామాల్లో అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న  ఆశ వర్కర్లు కు   ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఈఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పారితోషకాలు లేని పనులు రద్దు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి కసగొని లలిత, నాయకులు సంతోష,  మండల అధ్యక్షులు  మండలంలో ఉన్న ఆశ వర్కర్లు అందరు పాల్గొన్నారు.