ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కళనేరవేర్చడానికి గృహ లక్ష్మి పథకం 

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కళనేరవేర్చడానికి గృహ లక్ష్మి పథకం 

ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కళనేరవేర్చడానికి ముఖ్య మంత్రి కేసిఆర్ గృహ లక్ష్మి పథకం తీసుకొని వచ్చారని ఎమ్మెల్సీ ఎల్. రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని బిఎల్ గార్డెన్ లో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 640,123 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్,  59 మంది మహిళలకు  రూ. 59 లక్షల కళ్యాణ లక్ష్మి,షాది ముభారాక్ చెక్కులను జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ లతో కలిసి ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లు పంపిణి చేశారు. అంతకుముందు కొండా లక్ష్మన్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రం లో 4520 డబల్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం లో ఎమ్మెల్యే పాత్ర కీలకంమని ,కంటి చూపు సమస్య ఉన్న నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించిన గొప్ప మనసున్న వ్యక్తి ఎమ్మెల్యే అని అన్నారు.

 రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ద ఉందని, ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకొని ఎదగాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  కరోనా మహమ్మారి కారణం గానే గృహ లక్ష్మి పథకం ఆలస్యం అయిందని రైతు బందు, భీమా, 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ, రుణ మాఫీ వంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టి రైతును రాజును చేయటమే లక్ష్యంగా కేసిఆర్ పని చేస్తున్నారని అన్నారు. కొంత మంది అర్హులకు రాలేదని తెలిసింది అని వారికి వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని, గృహ లక్ష్మి నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ , జెడ్పీటీసీ మహేష్, ఎంపీపీలు ములాసపు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, పాక్స్ ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, రైతు బంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, ఎంపిడిఓలు రాజేశ్వరి, శైలజ రాణి, ఎంపివో లు రవి బాబు, సలీం, ఆర్ ఐ  ఖాజిం, రెవెన్యూ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.