రోడ్డు ప్రమాదాల నివరణకు అధికారులు దృష్టి సారించాలి

రోడ్డు ప్రమాదాల నివరణకు అధికారులు దృష్టి సారించాలి
  • పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విపిఓ వ్యవస్థను పునరుద్ధరించాలి.
  • క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి  ప్రజలకు సమర్థవంతమైన సేవలు  అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలన్నారు. నేరల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సిసి కెమెరాలు నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, వివిధ యూనియన్ నాయకులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించి  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై  ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు. విపిఓలు  ప్రతి  గ్రామని  సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి  మార్గంలో నడిచేటట్లు  వారికి అవగాహన కల్పిచాలన్నారు. ఈ సమావేశంలో  డీఎస్పీ లు  ప్రకాష్, రవీంద్ర రెడ్డి,  ఎస్ బి, డిసిఆర్ బి, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ లు  రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్,  సి.ఐ లు, రాంచందర్ రావు, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీ ఖాన్ , కోటేశ్వర్, ప్రవీణ్ కుమార్,ఎస్.ఐ లు, సిబ్బంది  పాల్గొన్నారు.