రెడ్యూస్రీ యుస్రీసైక్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలిమున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్

రెడ్యూస్రీ యుస్రీసైక్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలిమున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్

మెట్‌పల్లి ముద్ర:- పట్టణ ప్రజలకు చెత్తను రెడ్యూస్, రియూస్, రీసైక్లింగ్ చేసే విధానంపై మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్ పి లతో సమావేశం నిర్వహించి. పరిసరాల పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన బాధ్యతలపై అవగాహన కల్పించారు. పట్టణంలో ఆర్ఆర్ఆర్ రెడ్యూస్, రియూస్, రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని. కేంద్రాల వద్ద స్వయం సహాయక సంఘాలు వాలింటర్స్ గా వ్యవహరించి తడి పొడి చెత్తను వేరు చేసి కేంద్రాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని. పొడి చెత్తలో పనికిరాని వస్తువుల ను వేరుగా చేసి విక్రయించి మున్సిపల్కు ఆదాయం సమకూర్చాలని సూచించారు. ఈ ఆర్ ఆర్ ఆర్ కార్యక్రమం ఈనెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మారు విష్ణు వర్ధన్ రెడ్డి, ముజీబ్, సిబ్బంది మెప్మా ఆర్పీలు ఉన్నారు.