రాహుల్ గాంధీ నీ విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు - కొమిరెడ్డీ కరమ్ చంద్

రాహుల్ గాంధీ నీ విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు - కొమిరెడ్డీ కరమ్ చంద్

మెట్‌పల్లి ముద్ర:- కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదని రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డీ కరమ్ చంద్ అన్నారు. సోమవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రాములు నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రాహుల్ గాంధీ కి పబ్బులు, క్లబ్బులు తప్ప ఎడ్లు, వడ్లు తెలియవని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని. పబ్బులు క్లబ్బులు తిరిగిన చరిత్ర కేటీఆర్ ది అన్నారు. వైట్ ఛాలెంజ్ చేస్తే కోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడనీ. కేటీఆర్ కు చిత్తశుద్ది ఉంటే వైట్ ఛాలెంజ్ కు రావాలని సవాలు  విసిరాడు.దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఆ పదవిని సున్నితంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్   కుటుంబం దోచుకుంటుందన్నారు. దోచుకున్న సొమ్ముతో మంత్రి కేటీఆర్ 15 రోజులకు ఒకసారి విదేశాలకు ఎంజాయ్ చేస్తున్నడన్నారు. రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల హనుమాన్లు యాదవ్, వార్డ్ కౌన్సిలర్ యామ రాజయ్య, అందే గంగాధర్, న్యాయవాది సురభి అశోక్, ధ్యావతి గంగారం, కటకం గంగారెడ్డి, అల్లూరి లింగారెడ్డి, అంబటి హనుమాన్లు, సంగు గంగాధర్, తాండ్ర నర్సయ్య భీమయ్య, లస్మయ్య, చిదుగు కృష్ణ, ఎండి రజాక్, బర్ల అర్జున్, నల్ల మహేష్ పల్లికొండ ప్రవీణ్, పెంట ప్రణయ్, కంతి హరికుమార్, కలీం, తదితరులు పాల్గొన్నారు.