జగిత్యాల జిల్లాకు పేరు తీసుకురావాలి

జగిత్యాల జిల్లాకు పేరు తీసుకురావాలి

ఎమ్మెల్యే సంజయ్ కుమార్:

ముద్ర ప్రతినిధి జగిత్యాల: రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో సీఎం కప్ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మందమకరం, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి నరేష్, మెప్మా పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.