మిల్లెట్స్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలి..

మిల్లెట్స్ పై మహిళలు అవగాహన కలిగి ఉండాలి..
District Collector Yasmin Bhasha
  •  మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం
  • జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మిల్లెట్స్ పై మహిళలకు అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. మహిళ అభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రములో స్థానిక ఎల్ జీ  గార్డెన్ లో పోషణ పక్షోత్సవాల ముగింపు  కార్యక్రమంలో భాగంగా వెల్ బేబీ షో నిర్వహించి ఆరోగ్యవంతమైన చిన్నారులకు కలెక్టర్ అవార్డులను  అందించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ   జిల్లాలోని గర్భవతులు, బాలింతలు,  పిల్లలకు, కిషోరా బాలికలకు మిల్లెట్ ల పైన ( చిరు ధాన్యాలు) అవగాహన కల్పించి వారి లో ఆహార చేతన్యం తీసుకురావాలని అన్నారు. మిల్లెట్ లతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల కలిగే ఉపయోగాలను లాభాలను కార్యక్రమానికి వచ్చిన తల్లులకు, పిల్లలకు వివరించారు.  మహిళలు ఆరోగ్య ము పట్ల జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని , పోషక ఆహారం , మిల్లెట్ లను , తీసుకోవడం వల్ల వ్యాధులను అరికట్టడం తో పాటు , ఆరోగ్యకరమైన జీవితం పొందవచ్చని కలెక్టర్ సూచించారు.

అంతే కాకుండా మహిళల్లో చాలా మంది సిజీరియం కాన్పులు చేసుకుంటున్నారని, దీని ద్వారా అనారోగ్యానికి గురి అవుతారన్నారు ,  మహిళలు సిజిరియన్ కాన్పుల వల్ల నష్టాల గూర్చి సాధారణ కాన్పులు వల్ల కలిగే లాభాలను గురించి అవగాహన కల్పించి వారిని సాధారణ కాన్పులు ప్రోత్స హించలని అంగానీ టీచర్ల ను కోరారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలను తీసుకోవాలి తల్లులను కోరారు.  అంగన్ వాడి లు ఏర్పాటు చేసిన మిల్లెట్ ల స్టాల్ లో  మిల్లెట్ లతో తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు.   స్వస్త్ భాలక్ స్పర్థ కార్యక్రమాలో భాగముగా అంగాన్ వాడి  కేంద్రములో గుర్తించిన ఆరోగ్య మైన పిల్లలకు , గుడ్  హెల్త్ సర్టిికెట్లు అందచేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి. నరేష్, ఐసీడీఎస్ సిడిపిఓ లు , పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డనేటర్, సూపర్ వైజర్ లు , పోషణ అభియాన్ సిబ్బంది , అంగాని వాడి టీచర్లు, హెల్పర్లు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు