రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ వెంకటరమణాచారి కుటుంబానికి సహాయం

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ వెంకటరమణాచారి కుటుంబానికి సహాయం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ వెంకటరమణాచారి కుటుంబానికి జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు అయిన రూ.  16 లక్షల చెక్కులను వెంకటరమణాచారి భార్య అందజేశారు. వెంకటరమణాచారి కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారికి భ రోస కల్పిస్తామని తెలిపారు.  ధర్మపురి పోలీస్ స్టేషన్ లో పనిచేసిన కానిస్టేబుల్ వెంకటరమణచారి 2022 నవంబర్ 17న జరిగిన రోడ్డు ప్రమాద మృతిచెందాడు. ఈ కార్యక్రమంలో A.0 అమర్నాథ్ పాల్గొన్నారు.